ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్‌

Published : Oct 31, 2016, 03:19 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్‌

సారాంశం

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుదలైంది. ఫ‌స్ట్‌ లుక్‌కు ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌నోజ్ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు.

మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని అజ‌య్ అండ్ర్యూస్ నౌతాక్కి ద‌ర్శ‌కత్వంలో ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌లు నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్ మాట్లాడుతూ `ఒక్క‌డు మిగిలాడు` చిత్రంలో వేలుపిళ్ళై ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. ఈ చిత్రం శ్రీలంక‌లోని 15 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులు కోసం 1990లో జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో సాగుతుంది. మంచు మ‌నోజ్‌గారు చాలా బాగా కో ఆప‌రేట్ చేశారు. ప్ర‌భాక‌ర‌న్ గెట‌ప్‌కోసం వెయిట్ కూడా పెరిగాడు. వైజాగ్ ద‌గ్గ‌ర‌లోని ప‌ర‌వాడ ప్రాంతంలో యుద్ధ స‌న్నివేశాల‌ను 25 రోజుల పాటు చిత్రీక‌రించాం. మ‌నోజ్ ఇనెట‌న్స్‌తో కూడిన యాక్ష‌న్‌, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. ఈ సినిమా మ‌నోజ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది` అన్నారు.

 

బ్యాన‌ర్ః ఎస్‌.ఎన్‌.ఆర్‌.ఫిలింస్ ఇండియా ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్‌, ఆర్ట్ః పి.ఎస్‌.వ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః వి.కె.రామ‌రాజు, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, స్క్రీన్ ప్లేః గోపీ మోహ‌న్‌, మ్యూజిక్ః శివ నందిగామ‌, నిర్మాతః ఎస్‌.ఎన్‌.రెడ్డి, ల‌క్ష్మీకాంత్‌, ద‌ర్శ‌క‌త్వం-అజ‌య్ అండ్ర్యూస్ నౌతక్కి.

PREV
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్