
దీపావళి సీజన్ లో దీపాలను వెలిగిస్తున్న పవర్ స్టార్ ను శృతిహాసన్ రొమాంటిక్ గా చూస్తున్న స్టిల్ రిలీజ్ చేయటం దానికి తగ్గట్టు.. అనూప్ రుబెన్స్ సంగీతం కరెక్ట్ గా సరిపోవడంతో ఈ స్పెషల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. అన్నయ్య చిరంజీవి ఖైదీ నెం 150లో న్యూలుక్ తో ఆకట్టుకుంటే...తమ్ముడు కాటమరాయుడు మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు దీపవళితో పాటు మెగా బ్రదర్స్ అదనపు బొనాంజా కలిసి వచ్చినట్లయింది. అన్నయ్య ఖైదీ నెం 150 తో సంక్రాంతికి రావడానికి రెడీ అవుతుంటే... తమ్ముడు కాటమరాయుడు అంటూ ఉగాదికి రావడానికి రెడీ అవుతున్నాడు.