రొమాన్స్ కి వయసుతో పనేముంది.. మోహన్ బాబుని ఇలా ఎప్పుడూ చూసివుండరు!

Published : Jan 21, 2021, 12:52 PM IST
రొమాన్స్ కి వయసుతో పనేముంది.. మోహన్ బాబుని ఇలా ఎప్పుడూ చూసివుండరు!

సారాంశం

మోహన్ బాబు భార్య నిర్మలా దేవితో బీచ్ లో రొమాంటిక్ గా గడుపుతున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. షార్ట్స్ వేసుకొని బీచ్ లో కూర్చున్న మోహన్ బాబును భార్య నిర్మలా దేవి హగ్ చేసుకున్నారు.ఎప్పుడూ సీరియస్ గా ఉండే మోహన్ బాబుని ఇలా బీచ్ లో రొమాంటిక్ గా చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మోహన్ బాబులో మనకు తెలియని కొత్త కోణాన్ని పరిచయం చేసింది ఆయన కూతురు లక్ష్మీ మంచు. మోహన్ బాబు భార్య నిర్మలా దేవితో బీచ్ లో రొమాంటిక్ గా గడుపుతున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. షార్ట్స్ వేసుకొని బీచ్ లో కూర్చున్న మోహన్ బాబును భార్య నిర్మలా దేవి హగ్ చేసుకున్నారు. ఇక ఆ రొమాంటిక్ ఫోటోను మోహన్ బాబు అల్లుడు ఆండీ శ్రీనివాసన్ తీసినట్లు మంచు లక్ష్మీ తెలియజేశారు. 

ఎప్పుడూ సీరియస్ గా ఉండే మోహన్ బాబుని ఇలా బీచ్ లో రొమాంటిక్ గా చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మోహన్ బాబుకు నిర్మలా దేవి రెండవ భార్య. మొదటి భార్య విద్యా దేవి మరణం తరువాత ఆమె చెల్లెలు నిర్మలా దేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మీ, విష్ణు మొదటి భార్య సంతానం కాగా,  మంచు మనోజ్ నిర్మలా దేవి కుమారుడు. 

కాగా మోహన్ బాబు చాలా గ్యాప్ తరువాత హీరోగా ఓ మూవీలో నటిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే సూర్య హీరోగా ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ఆకాశం నీహద్దురా మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఆ మూవీ తమిళ, తెలుగు భాషలలో హిట్ టాక్ తెచ్చుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..