ప్రభాస్‌తో `రాజా డీలక్స్`.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు మారుతి.. ఇంతకి ఏం చెప్పాడంటే?

Published : Jan 22, 2022, 06:18 PM IST
ప్రభాస్‌తో `రాజా డీలక్స్`.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు మారుతి.. ఇంతకి ఏం చెప్పాడంటే?

సారాంశం

ప్రస్తుతం ప్రభాస్‌ భారీ చిత్రాలు చేస్తున్నారు. అన్నీ మూడు వందల కోట్లకుపైగా బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ప్రభాస్‌ మరో సినిమాకి కమిట్‌ అయినట్టు టాక్‌ నడుస్తుంది. 

ప్రభాస్‌(Prabhas) ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. ఇంకా చెప్పాలంటే ఆయన గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయారు. ఆయనకు ఇతర దేశాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇతర దేశాల్లోనూ ఆయన సినిమాలు విడుదలవుతున్నాయి. నాగ్‌ అశ్విన్‌తో Prabhas సినిమా పాన్‌ ఇండియాని మించి ఉంటుందన్నారు. అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే `స్పిరిట్‌` కూడా ఇతర దేశాల్లో రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ రేంజ్‌ ఇప్పుడు ఎవరూ ఊహించలేనంతగా మారిపోయింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ భారీ చిత్రాలు చేస్తున్నారు. అన్నీ మూడు వందల కోట్లకుపైగా బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ప్రభాస్‌ మరో సినిమాకి కమిట్‌ అయినట్టు టాక్‌ నడుస్తుంది. కామెడీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రాల దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయబోతున్నారని, దీనికి `రాజా డీలక్స్‌` అనే పేరు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్‌ భారీ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో వాటి మధ్య గ్యాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ని చేయాలనుకుంటున్నారట ప్రభాస్‌. 

ఈ చిత్రాన్ని `ఆర్‌ఆర్‌ఆర్‌` నిర్మాత డివివి దానయ్యతోపాటు నిరంజన్‌రెడ్డి కలిసి నిర్మిస్తారని ప్రచారం జరుగుతుంది. ఐడియా ప్రభాస్‌కి చెప్పగా, ఆయనకు నచ్చిందని, ప్రస్తుతం కథని పూర్తి స్థాయి బౌండెడ్‌ స్క్రిప్ట్ గా మార్చే పనిలో మారుతి ఉన్నారనే వైరల్‌ అవుతుంది. ఇది ఫిల్మ్ నగర్‌ సర్కిల్‌లోనూ, మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై దర్శకుడు మారుతి స్పందించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ పై విచిత్రంగా స్పందించడం విశేషం. 

`నా భవిష్యత్‌ ప్రాజెక్ట్ లు, టైటిల్స్, జోనర్స్, సంగీత దర్శకులు, ఇతర క్రూ గురించి ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. కానీ కాలమే అన్ని విషయాలు వెల్లడిస్తుంది. నన్ను మీరు సపోర్ట్ చేస్తున్న తీరు, ప్రోత్సహిస్తున్న తీరుకి ధన్యవాదాలు. జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి` అని తెలిపారు దర్శకుడు మారుతి. అయితే ఈ రూమర్స్ ని మారుతి ఖండించకపోగా, అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని చెప్పడంతో.. ప్రభాస్‌తో ప్రాజెక్ట్ ఉంటుందనే విషయానికే బలం చేకూరుతుంది. అయితే ఇంతటి భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్‌.. చిన్న సినిమా ఎందుకు చేస్తాడనే కామెంట్‌ కూడా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. 

 మారుతి ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా `పక్కా కమర్షియల్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటిస్తుంది. `జిల్‌` తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న చిత్రమిది. మరోవైపు ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలు చేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో  `స్పిరిట్‌` త్వరలో ప్రారంభం కానుంది. అలాగే హిందీలో సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ సినిమా, దిల్‌రాజు ప్రొడక్షన్‌లో మరో సినిమా చేయనున్నారని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు