ప్లీజ్ ..హెల్ప్ చేయండి, మంచు లక్ష్మీ ప్రసన్న రిక్వెస్ట్

Published : Jul 05, 2024, 06:18 AM IST
 ప్లీజ్ ..హెల్ప్ చేయండి, మంచు లక్ష్మీ ప్రసన్న రిక్వెస్ట్

సారాంశం

సమస్యకు పరిష్కారం చూపాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) సోషల్‌ మీడియా  ఇనిస్ట్రాలో  అభిమానులను కోరారు. 


నటి, నిర్మాత మంచు సోషల్‌ మీడియాలో షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. సాయం చేయండి అంటూ నెటిజన్లను రిక్వెస్ట్‌ చేయటం వైరల్ విషయంగా మారింది. వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా తాను పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) సోషల్‌ మీడియా  ఇనిస్ట్రాలో  అభిమానులను కోరారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇనిస్ట్రా ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

‘‘అమెరికా సిటిజన్‌ అయిన నా కుమార్తె స్కూల్‌ హాలీడేస్‌ త్వరలోనే ముగియనున్నాయి. ఈ నెల 12న మేం అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఎంబసీ (రాయబార కార్యాలయం) వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వారిని సంప్రదించేందుకు నాకు మార్గం లేకుండా పోయింది. వీసా జారీ అయి నెలకుపైనే అయినా దాన్ని చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఎవరైనా హెల్ప్‌ చేయగలరా?’’ అని అభ్యర్థించారు. ఈ పోస్ట్‌పై  అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇవ్వగా.. ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని నేరుగా ఎంబసీకి వెళ్లండంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్