రాంచరణ్ నిర్మించే నిఖిల్ సినిమా.. బడ్జెట్ గురించి షాకింగ్ డీటెయిల్స్ 

Published : Jul 04, 2024, 10:23 PM IST
రాంచరణ్ నిర్మించే నిఖిల్ సినిమా.. బడ్జెట్ గురించి షాకింగ్ డీటెయిల్స్ 

సారాంశం

త్వరలో రాంచరణ్ యువ హీరో నిఖిల్ తో ది ఇండియా హౌస్ అనే చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ సంస్థతో చేతులు కలిపి రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తూనే నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు. ఆల్రెడీ చరణ్.. తన తండ్రి చిరంజీవితో సైరా చిత్రాన్ని నిర్మించారు. త్వరలో రాంచరణ్ యువ హీరో నిఖిల్ తో ది ఇండియా హౌస్ అనే చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. 

అభిషేక్ పిక్చర్స్ సంస్థతో చేతులు కలిపి రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రం గూస్ బంప్స్ మూమెంట్స్ తో పాన్ ఇండియా వైడ్ గా హిట్ అవుతుందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. రాంచరణ్ లాంటి హీరోతో ఈ విధంగా కొలాబరేట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. 

ఈ చిత్రం దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. బడ్జెట్ లెక్కల గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఈ చిత్రం విషయంలో మేము కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తాం. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇతర బాలీవుడ్ తారలు కూడా కొంతమంది ఈ చిత్రంలో నటించబోతున్నట్లు అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఇండియాలో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ లాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం అని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌
Karthika Deepam 2 Today Episode: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- నోరుజారిన పారు-బాధలో దీప, కార్తీక్