స్టార్ హీరో భార్యపై మంచులక్ష్మీ కామెంట్స్!

Published : Nov 15, 2018, 04:50 PM IST
స్టార్ హీరో భార్యపై మంచులక్ష్మీ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన మంచు లక్ష్మీ ఈ మధ్య  తెలుగులో నటించడం తగ్గించేసింది. తన వ్యాపారాలతో బిజీ అయిపోయింది. ఇదిఇలా ఉండగా ఆమెకి తమిళంలో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే 'కాట్రిన్ మొలి'. 

బాలీవుడ్ లో వచ్చిన 'తుమ్హారీ సులు' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జ్యోతికకి బాస్ పాత్రలో కనిపించడానికి మంచు లక్ష్మీ అంగీకరించింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు లక్ష్మీ.. జ్యోతికపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ''జ్యోతిక మంచి నటి.. ఎలాంటి హావభావాలైనా తన కళ్లతోనే పలికిస్తుంది. పాత్రలో ఆమె ఒదిగిపోయే తీరు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆమెతో కలిసి పని చేయడం నా అదృష్టం అనిపించింది. ఈ సినిమాలో జ్యోతికతో కలిసి నటించినప్పటి నుండి నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు