ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Published : Dec 14, 2025, 06:10 AM IST
mana shankaravaraprasad gaaru movie

సారాంశం

చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది. ప్రభాస్‌ కి గ్యాప్‌ ఇవ్వకుండా వస్తున్నారు చిరు. 

సంక్రాంతికి ఐదు సినిమాలు

వచ్చే ఏడాది సంక్రాంతి చాలా రసవత్తరంగా ఉండబోతుంది. దాదాపు ఐదు తెలుగు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. ప్రభాస్‌ `ది రాజాసాబ్‌`, చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు`, రవితేజ `భర్తమహాశయులకు విజ్ఞప్తి`, నవీన్‌ పొలిశెట్టి `అనగనగ ఒక రాజు`, శర్వానంద్‌ `నారి నారి నడుమ మురారీ` చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటితోపాటు తమిళం నుంచి రెండు సినిమాలు రానున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద గట్టి పోటీ ఉండబోతుంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఇన్నాళ్లు సంక్రాంతికి వస్తున్నట్టుగానే చెప్పారు, కానీ డేట్‌ని ఇవ్వలేదు. తాజాగా డేట్‌ని రివీల్‌ చేస్తూ ఈవెంట్‌ ని ఏర్పాటు చేసింది టీమ్‌.

`మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ రిలీజ్‌ డేట్‌

`మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఇప్పటి వరకు జనవరి 13గానీ, 14గానీ వస్తుందని భావించారు. కానీ ముందుగానే తీసుకొస్తున్నారు. ఇదే ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. సంక్రాంతికి ముందుగా జనవరి 9న ప్రభాస్‌ నటించిన `ది రాజాసాబ్‌` రాబోతుంది. అయితే ఈ మూవీకి నాలుగైదు రోజులు ఉంటుందేమో అనుకున్నారు. కానీ మరీ టైట్‌ చేశారు.  మూడు రోజుల్లోనే చిరంజీవి సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రభాస్‌ మూవీకి గట్టి దెబ్బపడబోతుందని చెప్పొచ్చు. అయితే సంక్రాంతికి గ్యాప్‌ లేకపోయినా సినిమా బాగుంటే వసూళ్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మూవీ, భారీ అంచనాలు

ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.

ప్రత్యేక పాత్రలో వెంకటేష్‌

'మన శంకర వర ప్రసాద్ గారు' పూర్తి షూటింగ్ ని పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. చిరంజీవి, అనిల్ రావిపూడిల కలయికే ఇప్పటికే చాలా ఎగ్జైట్‌మెంట్‌ ని క్రియేట్ చేసింది, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడవడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి.

 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌