Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌

Published : Dec 08, 2025, 11:19 PM IST
Rajasekhar

సారాంశం

హీరో రాజశేఖర్‌ గాయాలపాలయ్యారు. ఆయన సినిమా షూటింగ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డారు. ప్రస్తుతం సర్జరీ జరిగింది. అయితే 36ఏళ్ల తర్వాత సరిగ్గా అదే నెలలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. 

హీరో రాజశేఖర్‌కి గాయాలు

హీరో రాజశేఖర్‌ గాయాలపాలయ్యారు. ఆయన షూటింగ్‌ సమయంలో గాయపడ్డారు. కుడికాలికి గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. దాదాపు నెల రోజులకుపైగానే రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది. రాజశేఖర్‌ కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న `బైకర్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఆయన  మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

మూడు గంటలపాటు సర్జరీ

ఈ క్రమంలో ఇటీవల(నవంబర్‌25)న రాజశేఖర్‌ గాయపడినట్టు తాజాగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయని, మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు సర్జరీ చేశారు. ఈ సర్జరీ సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందట. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం.

నెల రోజులపాటు విశ్రాంతి

సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు. సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. అందువల్ల కొన్ని రోజులపాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.

36ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్‌

రాజశేఖర్ కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో 'మగాడు' షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు. రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'బైకర్'. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల చిత్రీకరణలు మొదలు అవుతాయని సమాచారం.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?