షూటింగులో హీరో మమ్ముట్టికి గాయాలు!

Published : Feb 19, 2018, 05:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
షూటింగులో హీరో మమ్ముట్టికి గాయాలు!

సారాంశం

‘మామంగమ్’ షూటింగ్ లో సంఘటన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గాయపడ్డ మమ్ముట్టి  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బహుభాషా చిత్రం

ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తన కొత్త చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. సజీవ్ పిళ్లై దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘మామంగమ్’ షూటింగ్ లో ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మమ్ముట్టి గాయపడ్డట్టు చిత్ర యూనిట్ పేర్కొంటూ, ఆయనకు స్వల్ప గాయాలయ్యానని తెలిపింది. వెంటనే చికిత్స అందించామని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొంది.కాగా, రూ.50 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు పలువురు ‘మామంగమ్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మమ్ముట్టి నటించిన పెరోల్, అంకుల్, పెరాంబు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు