ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం. ప్రముఖ మలయాళ నటుడు మముక్కోయ కన్నుమూత

Published : Apr 26, 2023, 05:26 PM ISTUpdated : Apr 26, 2023, 05:29 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం. ప్రముఖ మలయాళ నటుడు మముక్కోయ కన్నుమూత

సారాంశం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు మముక్కోయ తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల వయస్సులో ఆయన కన్ను మూశారు.   

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీలు కుదిపేస్తున్నాయి. ప్రతీ భాష నుంచి ఎవరో ఒక సీనియర్ నటులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) తుది శ్వాస విడిచారు.  గత సోమవారం కేరళలోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ హార్ట్ ఎటాక్ రావడంతో.. ఒక్కసారిగా కుప్పకూలారు. 

మముక్కోయ ఒక్క సారిగా కుప్పకూలడంతో..  ఆయనను వెంటనే మలప్పురంలోని ఓ ప్రైవేట్‌  హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయన పరిస్థితిని పరిశీలించిన డాక్టర్స్   కార్డియాక్‌ అరెస్టుతో ఆయన కుప్పకూలారని తేల్చారు. కార్డియాక్‌ అరెస్ట్‌ అనంతరం ఆయన మెదడు రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగిందన్నారు. ఇక అప్పటి నుంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్న ఆయన.. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మముక్కోయ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 సంవత్సరాలు 

1970లలో మముక్కోయ  వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి  ఎన్నో విజయవంతమైన  సినిమాల్లో నటించారు.అలనాటి మలయాళ నటుడు మముక్కోయ రెండుతరాల నటులతో కలిసి యాక్ట్ చేశారు. తన కెరీర్ ను నాటకాలతో మొదలు పెట్టి.. సినిమా రంగంలోకి వచ్చి.. స్టార్ గా స్థిరపడ్డాడు. థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ లో ఎన్నో సాధించిన మాముక్కోయ...ఆపై మ‌ళ‌యాళ సినీ ప‌రిశ్రమ‌లో కూడా ఎన్నో అవార్డ్ లను సాధించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడయిన్ గా.. పలు పాత్రల్లో గుర్తుండిపోయే నటన చూపించిన ఆయన  దాదాపుగా  450కిపైగా సినిమాల్లో న‌టించారు. పలు అవార్డులు కూడా సాధించాడు.  ఆయన మృతితో మలయాళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్