2 కోట్ల బడ్జెట్.. 55 కోట్ల వసూళ్ళు.. మలయాళ సినిమా సంచలనం

Published : Mar 05, 2023, 12:44 PM IST
2 కోట్ల బడ్జెట్.. 55 కోట్ల వసూళ్ళు.. మలయాళ సినిమా సంచలనం

సారాంశం

కొన్ని సినిమాలు  రిలీజ్ అయ్యేంత వరకూ సైలెంట్ గా ఉంటాయి.. రిలీజ్ తరువాత  సత్తా ఏంటో చూపిస్తాయి. అటువంటి సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు, ఎవరూ ప్రమోట్ చేయనవసరం లేదు. అలాంటి సినిమాలు ఇప్పటి వరకూ చాలా వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ఈఇలానే సత్తా చాటుతుంది. 

కొన్ని సినిమాలు  రిలీజ్ అయ్యేంత వరకూ సైలెంట్ గా ఉంటాయి.. రిలీజ్ తరువాత  సత్తా ఏంటో చూపిస్తాయి. అటువంటి సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు, ఎవరూ ప్రమోట్ చేయనవసరం లేదు. అలాంటి సినిమాలు ఇప్పటి వరకూ చాలా వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ఈఇలానే సత్తా చాటుతుంది. 

కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఓ మలయాళ సినిమా  ఇప్పటివరకు 55 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టిస్తోంది.  సరికొత్త రికార్డలు నెలకొల్పుతుంది.ఎవరూ ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు సాధిస్తున్న ఈ సినిమా... పేరున్న దర్శకుడు, స్టార్ కాస్ట్‌, పెద్ద ప్రొడక్షన్‌ సంస్థ ఇవేమి లేకుండానే ఈ రికార్డ్ సాధించింది.  కేవలం కంటెంట్‌తో  మాత్రం అందరి మనసు గెలుచుకుంటుంది సినిమా.. మలయాళ బాక్సాపీస్ దగ్గర  కనకవర్షం కురిపిస్తుంది. ఈ సినిమా ఇంత సక్సెస్ సాధిస్తుందని ఆ సినిమాకు సబంధించిన కాస్ట్‌ అండ్‌ క్రూ కూడా  ఎక్సపెక్ట్‌చేసి ఉండరు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. రొమంచన్‌.  మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ గురించి చూస్తే.

మలయాళంలో నెల రోజుల కిందట ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై.. అక్కడి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుంది రోమంచన్. మాలీవుడ్ లో  సంచలనాలు సృష్టిస్తుంది. ఇక్కడ మరో విషేశం ఏంటీ అంటే..  ఈ సినిమాలో షౌబిన్ షాబిర్‌ తప్పతే పెద్దగా పేరున్న నటుడే లేదు. ఇక దర్శకుడిగా జీతూ మాధవన్‌కు కూడా ఇది ఫస్ట్ మూవీ.  హర్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. 
ఏడుగురు బ్రహ్మచారుల చుట్టూ తిరిగే ఈ కథ.. ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తోంది. బోర్‌ కొడుతుందనే ఉద్దేశంతో  ఆ ఏడుగురు బ్రహ్మచారులు సరదాగా ఔజా అనే ఒక గేమ్‌ అడుతారు. అనుకోకుండా ప్రేతాత్మలతో మాట్లాడం ఈ గేమ్‌ థీమ్. అయితూ ఈ గేమ్  కాస్తా అనుహ్య సంఘటనలకు దారి తీస్తుంది.

ఆడయన్స్ ను ఒక  వైపు భయపెడతూనే..  మరోవైపు కామెడీతో నవ్వించే ఈ సినిమా.. చాలా మందికి తెలిసి స్పిరిట్ గేమ్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తవాడు అయినా.. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెురకెక్కించాడు. కొత్తవారు అయినా నటీనటులు కూడా అద్భుతంగా చేశారు. మలయాలంతో పాటు ఇతర భాషల వారిని కూడా ఆకర్షిస్తున్న ఈసినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం పోటీ పెరుగుతోంది. అంతే కాదు భారీగా డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి ఈసినిమాను డబ్బింగ్ చేస్తారా..? లేక రీమేక్ చేస్తారా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?