నెదర్లాండ్ పాప్ సింగర్‌తో కలిసి అల్లు అర్జున్ స్టెప్పులు, ఊ అంటావా మామ అంటూ అదరగొట్టిన బన్నీ

Published : Mar 05, 2023, 11:50 AM ISTUpdated : Mar 05, 2023, 11:51 AM IST
 నెదర్లాండ్ పాప్ సింగర్‌తో కలిసి అల్లు అర్జున్  స్టెప్పులు, ఊ అంటావా మామ అంటూ అదరగొట్టిన బన్నీ

సారాంశం

అల్లు అర్జున్ ఫుష్ప మ్యానియా ఇంకా తగ్గలేదు. వరల్డ్ వైడ్ గా ఎక్కడో ఒక చోట ఈసినిమా పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో నెదర్లాండ్ పాప్ సింగర్ నోట బన్నీ పాట.. ఆ పాటకు ఆ సింగర్ తో కలిసి కాలు కదిపాడు ఐకాన్ స్టార్.   

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో.. అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈసినిమా  బన్నీకి వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ యాక్టింగ్, యాటిట్యూడ్ తో పాటు..  పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ దేశమంతటా  మారు మోగిపోయాయి. అల్లు అర్జున్ తో పాటు ఈసినిమాలో నటించిన అందరునటీనటులు పాపులర్ అయ్యారు. ఈ సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలయింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక పుష్ప2 తో ఇమేజ్ నుడబుల్ చేసుకుని బాలీవుడ్ లో జెండా పాతాలి అని ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్. 

ఇక పుష్ప2 కోసం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండియా అంతటా పుష్ప 2  ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప సినిమాలోని అన్ని పాటలతో పాటు.. ఊ అంటావా ఊ ఊ అంటావా పాట బాగా పాపులారిటీని సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ ఆల్ ఇండియా అంతట పుష్ప సాంగ్స్ మారుమోగాయి.. ఇక  విదేశాల్లో కూడా బాగా ఈ పాట పాపులర్ అయింది.

 

ఇక రీసెంట్ గా పుష్ప ఐటమ్ సాంగ్ తో పాటు బన్నీ లైవ్ డాన్స్ వైరల్ అవుతోంది. ఈమధ్య అల్లు అర్జున్ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్‌బర్న్ అనే పేరుతో శనివారం రాత్రి ఓ లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ లైవ్ కాన్సర్ట్ కి భారీగా మ్యూజిక్ లవర్స్ వచ్చారు.  అయితే ఈ లైవ్ కాన్సర్ట్ కి అల్లు అర్జున్ కూడా వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. బన్నీని చూసి ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోరు. 

ఇక అందరిని  ఆశ్చర్యంలో ముంచడమే కాకుడా.. ఈ పాప్ సింగర్ తో కలిసి పుష్ప సినిమాలో ఊ అంటావా మామా పాటకు స్టెప్పులేసి చూపించాడు. పాప్ సింగర్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. వీరిద్దరి పెర్ఫామెన్స్ చూసి.. అల్లు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. దీనికి సబంధించిన ఫోటోస్ ను బన్నీ తన ఇన్ స్టా పేజ్ లో శేర్ చేశుకున్నాడు. ఇక ప్రస్తుతం  పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తరువాత షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు టీమ్. ఈలోపు ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం