మంటలు రేపుతున్న హీరోయిన్ వీడియో, ఓపెన్ గా స్నానం చేస్తూ.. సిగ్గులేదా అంటూ నెటిజన్ కామెంట్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 10, 2022, 08:37 AM IST
మంటలు రేపుతున్న హీరోయిన్ వీడియో, ఓపెన్ గా స్నానం చేస్తూ.. సిగ్గులేదా అంటూ నెటిజన్ కామెంట్

సారాంశం

మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీనేజ్ వయసు నుంచే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తోంది.

మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీనేజ్ వయసు నుంచే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తోంది. తెలుగులో ఇంతవరకు ఈ యంగ్ బ్యూటీ నటించలేదు. మలయాళంలో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫెర్ లో నటించింది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. ఈ యంగ్ బ్యూటీ బికినీల్లో పచ్చని ప్రకృతి నడుమ షవర్ కింద స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. అందులోనే ఆమె దీపికా పదుకొనె 'గెహ్రాయాన్' చిత్రంలోని ఓ సాంగ్ కి డాన్స్ చేస్తూ కనిపించింది. 

దీనితో నెటిజన్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది అని కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఓ ఆకతాయి నెటిజన్ మాత్రం సానియా పై మండిపడుతూ వివాదాస్పదంగా కామెంట్ చేశాడు. 'ఛీ సిగ్గులేదా.. స్నానం చేస్తున్న వీడియోల్ని పోస్ట్ చేస్తావా.. ఈవ్ టీజింగ్ కేసులు ఇక ఎలా తగ్గుతాయి' అంటూ ఘాటుగా విమర్శించాడు. 

దీనితో సానియా సింపుల్ గా అతడికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. 'అసలు సిగ్గు అంటే ఏంటి' అని అతడినే ప్రశ్నించింది. దీనితో కొంతమంది నెటిజన్లు సానియాకు మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. 

ఈ యంగ్ బ్యూటి యాటిట్యూడ్ చూస్తుంటే ట్రోలింగ్ కు అసలు బెదిరేలా కనిపించడం లేదు. సానియా అయ్యప్పన్ తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సానియా 'సెల్యూట్' అనే మూవీలో నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం