మలయాళం బాక్సాఫీసు వద్ద ‘‘2018’’ కలెక్షన్ల వర్షం.. ఇది నిజమైన కేరళ స్టోరీ అంటున్న ఫ్యాన్స్..

Published : May 09, 2023, 03:15 PM ISTUpdated : May 09, 2023, 03:34 PM IST
మలయాళం బాక్సాఫీసు వద్ద ‘‘2018’’ కలెక్షన్ల వర్షం.. ఇది నిజమైన కేరళ స్టోరీ అంటున్న ఫ్యాన్స్..

సారాంశం

కేరళలోని సినీ ప్రేక్షకుల మధ్య ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. కేరళలో చోటుచేసుకున్న డిజాస్టర్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం  ‘‘2018’’‌ను అక్కడి సినీ ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తిరువనంతపురం: కేరళలోని సినీ ప్రేక్షకుల మధ్య ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. కేరళలో చోటుచేసుకున్న డిజాస్టర్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం  ‘‘2018’’‌ను అక్కడి సినీ ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ చిత్రాన్ని రియల్ కేరళ స్టోరీ అని పిలుస్తున్నారు. అయితే యాదృచ్చికంగా.. వివాస్పద చిత్రం ‘‘ది కేరళ స్టోరీ’’‌తో పాటే 2018 చిత్రం కూడా అదే రోజు(మే 5)  విడుదలైంది. అయితే సుదీప్తో సేన్ దర్శకత్వం ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు  ‘‘2018- ప్రతి ఒక్కరు హీరోనే’’ చిత్రం మాత్రం ప్రేక్షుల ప్రశంసలు అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే రూ. 1.85 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మౌత్ టాక్‌తో థియేటర్ల వద్ద తొలి రోజుకు మించి సందడి పెరిగింది. వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక, నాలుగు రోజుల్లో మొత్తంగా రూ. 13 కోట్లు వసూలు చేసింది.  

 


కేరళలో ‘‘2018’’ చిత్రం రోజు వారీ గ్రాస్ కలెక్షన్లు..
1వ రోజు - రూ. 1.85 కోట్లు
2వ రోజు - రూ. 3.22 కోట్లు
3వ రోజు - రూ. 4.1 కోట్లు
4వ రోజు - రూ. 4 కోట్లు
మొత్తం = 4 రోజుల్లో రూ. 13.17 కోట్ల గ్రాస్

ఇక, 2018 చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రియల్ కేరళ స్టోరీ అని పిలుస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, టోవినో థామస్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్, తన్వీ రామ్, శివాద,  గౌతమి నాయర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించిన నటుడు టోవినో థామస్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. భయంతో భారత సైన్యం నుండి పారిపోయిన వ్యక్తి చివరికు ఇతరులను రక్షించడానికి తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టిన పాత్రలో టోవినో థామస్ నటించారు. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా '2018' చిత్రంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

 

ఇక, ది కేరళ స్టోరీ చిత్రంపై కేరళలో భిన్నవాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఈ చిత్రంపై ఘాటుగా స్పందిచారు. ఈ చిత్రం ద్వారా రాష్ట్రంలో ద్వేషం, రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారని మండిపడ్డారు. 32 వేల మందిని మతం మార్చి.. ఐసిస్‌లోని చేర్చారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. అయితే ఎవరైనా ఈ చిత్రంలోని ఆరోపణలు నిరూపిస్తే రూ.కోటి రివార్డు ఇస్తామని ఒక ముస్లిం సంస్థ గతంలో ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి