40 ఏళ్ల తర్వాత ఒకే బైక్‌పై రజినీకాంత్, సూపర్‌స్టార్ ఫోటో రిలీజ్ చేసిన ఏవీఎం

Published : Mar 01, 2024, 06:27 PM ISTUpdated : Mar 01, 2024, 06:30 PM IST
40 ఏళ్ల తర్వాత ఒకే బైక్‌పై రజినీకాంత్,  సూపర్‌స్టార్ ఫోటో రిలీజ్ చేసిన ఏవీఎం

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ అరుదైన ఫోటో వైరల్ అవుతోంది. ఆయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వాడిన బైక్ పై మళ్ళీ కనిపించారు. ఇంతకీ సందర్భం ఏంటంటే..? 

సూపర్ స్టార్ రజనీకాంత్ రేర్ ఫోటోను రిలీజ్ చేశారు  ప్రముఖ  పురాతన నిర్మాణ సంస్థ ఏవీఎం. తమిళంతో పాటు సౌత్ లాంగ్వేజ్ లలో  90 ఏళ్లుగా సినిమా ప్రయణాన్ని కొనసాగిస్తున్న ఈ నిర్మాణ సంస్థ.. 90 ఏళ్లు పురస్కరించుకుని  ఏవీఎం కంపెనీ తమ సినిమాల్లో ఉపయోగించిన వాహనాలను ప్రదర్శిస్తోంది.

AVM ప్రొడక్షన్ కంపెనీ 1935 లో విడుదలైన ఈసంస్థ ఎన్నో వేల సినిమాలు నిర్మించింది.  సినిమాతో తమిళ సినిమా ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అవతరించింది. వారు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ మరియు బెంగాలీలతో సహా వివిధ భారతీయ భాషలలో సినిమాలు నిర్మించి విజయవంతమైన నిర్మాణ సంస్థగా కొనసాగుతున్నారు. 

తమిళ సినీ ప్రపంచంలో విడుదలైన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఈ సంస్థ నిర్మించి అందించడంతో పాటు ఎంతో మంది గొప్ప కళాకారులను ఇండస్ట్రీకి  పరిచయం చేసింది సంస్థ. ఇక రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రదర్శణలో.. తమిళ స్టార్ హీరో ..తలైవా.. సూపర్ స్టార్  రజనీకాంత్ .. రాధ నటించిన  బయుమ్ పులి సినిమా ను  1983 లో రిలీజ్ చేసింది  AVM. ఈమూవీ వారికి 126వ సినిమా.  

 

పంజు అరుణాచలం రచించిన ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే.. ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వాడిన సుజుకీ బైక్ ను ఏవీఎం కంపెనీ 40 ఏళ్ల తర్వాత కూడా మెయింటెయిన్ చేస్తోంది. సుజుకి బైక్ ప్రస్తుతం చెన్నైలో కంపెనీ నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడింది. ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏవీఎం కంపెనీ ఎగ్జిబిషన్‌కు వచ్చినప్పుడు 40 ఏళ్ల క్రితం పాయుమ్‌ పులిలో ఉపయోగించిన బైక్‌పైనే కూర్చుని స్టైల్‌గా పోజులిచ్చాడు.

ఏవీఎం సంస్థ ఇప్పుడు ఆ ఫోటోను విడుదల చేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏవీఎం మ్యూజియం” పేరుతో చెన్నైలో ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. కాగా రజినీకాంత్ ఫోటో చూసి ప్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోటో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా