అమెరికాలో టైగర్ దిగింది ఇక రచ్చే... సింబాలిక్ గా హింట్ ఇచ్చిన ఎన్టీఆర్!

Published : Mar 07, 2023, 10:41 AM IST
అమెరికాలో టైగర్ దిగింది ఇక రచ్చే... సింబాలిక్ గా హింట్ ఇచ్చిన ఎన్టీఆర్!

సారాంశం

ఎన్టీఆర్ అమెరికాలో దిగారు. ఆయన ఆస్కార్ వేడుక కోసం అక్కడకు వెళ్లడం జరిగింది. అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు.   

కొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ లో ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. అన్నయ్య తారకరత్న అకాల మరణం కారణంగా ఎన్టీఆర్ ఇండియాలోనే ఉండిపోయారు. మార్చి 2న తారకరత్న పెద్దకర్మ ముగిసిన నేపథ్యంలో 6న ఎన్టీఆర్ బయలుదేరి అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్ళాక ఎన్టీఆర్ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన బాల్కనీలో నిల్చుని నగరం వైపు చూస్తున్నట్లున్న ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. 

ఆయన టీ షర్ట్ వెనుక టైగర్ సింబల్ ఉంది. ప్రపంచం వైపు తీక్షణంగా చూస్తుంటే ఏలేయడానికి సిద్ధమని సింబాలిక్ గా చెప్పినట్లు ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు గ్లోబల్ ఫేమ్ తెచ్చింది. అమెరికన్ మీడియా ఈ ఇద్దరు హీరోల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. రామ్ చరణ్ కొన్ని అరుదైన గౌరవాలు అందుకున్నారు. ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోకి గెస్ట్ గా హాజరయ్యారు. 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు విశిష్ట అతిథిగా చరణ్ హాజరయ్యారు. తన చేతుల మీదుగా ఓ అవార్డు ప్రదానం చేశారు. అలాగే స్పాట్ లైట్ అవార్డుతో గౌరవించబడ్డారు. HCA ఎన్టీఆర్ ని సైతం ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్ ఇండియాలో ఉండిపోవడంతో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయారు. ఇక ఎన్టీఆర్ ని అవార్డుకు ఎంపిక చేయడంతో పాటు త్వరలో ఆయనకు అందజేయనున్నట్లు తెలియజేశారు. 

మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. సదరు ఈవెంట్లో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ పాల్గొననుంది. ఇందుకే ఎన్టీఆర్ అమెరికా వెళ్లడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కి నామినేటైన విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ సినిమా ఆస్కార్ కల నెరవేరుస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం అవుతుంది. ఆల్రెడీ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆశలు బలపడ్డాయి.  
 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం