‘జైలర్’ విలన్ వినాయకన్ పై లైంగిక ఆరోపణలు.! ఆ మోడల్ తో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు..

Published : Aug 31, 2023, 05:54 PM ISTUpdated : Aug 31, 2023, 06:13 PM IST
‘జైలర్’ విలన్ వినాయకన్ పై లైంగిక ఆరోపణలు.! ఆ మోడల్ తో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు..

సారాంశం

మలయాళ సీనియర్ నటుడు, ‘జైలర్’ విలన్ వినాయకన్ గురించి షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఓ మోడల్ తో ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్టు గా తెలుస్తోంది. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.   

మలయాళ నటుడు, సీనియర్ యాక్టర్ వినాయకన్ (Vinayakan) పేరు ప్రస్తుతం ‘జైలర్’ (Jailer) చిత్రంతో మారుమోగుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ మూవీలో వినాయకన్ విలన్ గా నటించారు. ఆయన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్  నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే మూవీలోని నటీనటుల పెర్ఫామెన్స్ కూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ‘జైలర్’ విలన్ గా వినాయకన్ పేరు మారుమోగుతోంది. ఆయన నటనకు ప్రేక్షకులకు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయకన్ గురించి మరో  షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మంచి గుర్తింపు తెచ్చుకోగానే ఆయన గతంలో  చేసిన కొన్ని పనులను కొందరు బయటపెడుతున్నారు. ఈ సందర్భంగా వినాయనక్ ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

మృదులా దేవి మోడల్ తో  వినాయకన్ 2019లో అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. అది కూడా ఫోన్ లో అసభ్యంగా మాట్లాడడని తెలుస్తోంది. మోడల్ తో పాటు తల్లిని కూడా తన రూమ్ కి రావాలని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో  వారు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆయన అసభ్యంగా ప్రవర్తించి మాట వాస్తవమేనని తెలుస్తోంది. కేసు ఫిర్యాదు తర్వాత ఆయన్ని అరెస్ట్ కూడా చేశారంట. బెయిల్ పై రిలీజ్ అయ్యాడని తెలుస్తోంది. 

అయితే, ఈ వివాదం నాలుగేళ్ల కింద జరగగా ఇప్పుడు ‘జైలర్’ భారీ బ్లాక్ బాస్టర్ కావడంతో.. అందులోనూ వినాయన్ నటనకు ప్రశంసలు అందుతున్న క్రమంలో  ఈ వివాదం మరోసారి బయటికి వచ్చింది. ఇక వినాయకన్ 1995లో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్నచిన్న పాత్రలతో అలరించాడు. నెమ్మదిగా విలన్ పాత్రల్లో ప్రసిద్ధి చెందారు. మలయాళం, తమిళంలో చాలా సినిమాలు చేశారు. తెలుగులోనూ ‘అసాధ్యుడు’ చిత్రంలో వినాయకన్ నటించారు. ప్రస్తుతం ‘జైలర్’తో మాత్రం సౌత్ లో బాగా పాపులర్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ