ప్రభాస్ హీరోయిన్ కు లోకల్ ట్రైన్‌లో చేదు అనుభవం, స్పందించిన పోలీసులు

Published : Jun 15, 2025, 03:54 PM IST
malavika mohanan

సారాంశం

స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీసులు అధికారికంగా స్పందించారు. 

ఈ మధ్య సెలబ్రిటీలు పబ్లిక్ ట్రాన్సపోర్ట్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఈక్రమంలో కొంత మంది చేదు అనుభవాలు కూడా ఫేస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముంబయ్ లో స్టార్ సెలబ్రిటీలు ట్రాఫిక్ కు భయపడి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ మాళవిక కూడా ఇలానే లోకల్ ట్రైయిన్ లో వెళ్తుండగా.. ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యిందట. కాని మళవికకు ఈ అనుభవం ఇప్పుడు ఎదురయ్యింది కాదు. ఇంతకీ విషయం ఏంటంటే?

మాళవిక మాట్లాడుతూ, తాను కాలేజ్ చేసే రోజుల్లో రాత్రి 9:30 సమయంలో ముంబై లోకల్ ట్రైన్‌లో స్నేహితురాళ్లతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని వివరించారు. “మేము ప్రయాణిస్తున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ దాదాపుగా ఖాళీగా ఉంది. కాసేపటికే ఒక వ్యక్తి కిటికీ గ్రిల్ దగ్గరికి వచ్చి ‘ఏక్ చుమ్మా దేగీ క్యా?’ అని అసభ్యంగా అడిగాడు. మేము ముగ్గురం ఆ సంఘటనతో భయపడి, ఏం చేయాలో తెలియక పూర్తిగా నిస్సహాయంగా మిగిలిపోయాం,” అని మాళవిక చెప్పారు.

ఆయన కంపార్ట్‌మెంట్ వెలుపల నుంచే మాట్లాడటంతో మేము ఆయనను అడ్డుకోలేకపోయామని, దాదాపు 10 నిమిషాల తర్వాత తదుపరి స్టేషన్ వచ్చేసరికి ప్రయాణికులు లోపలికి రావడంతో తాము ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు.

 

 

ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాన్ని గమనించిన ముంబై పోలీసులు, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. “ప్రియమైన మాళవిక గారు, మీరు మీ అనుభవాన్ని పంచుకోవడం మేము చూశాము. ఇలాంటి సంఘటనలు బాధాకరమైనవి, దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగించే అవకాశమున్నవని మేము అర్థం చేసుకుంటున్నాం. నగరంలో ఇలాంటివి ఎప్పుడైనా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 112 లేదా 100 నంబర్‌కు కాల్ చేయండి. ఫిర్యాదు చేయకపోతే నేరస్థులకు ధైర్యం వస్తుంది. ముంబై మహిళలకు సురక్షితమైన నగరం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మేము నిరంతరం కృషి చేస్తాం,” అని పేర్కొన్నారు.

ముంబై పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామనీ, ఫిర్యాదు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌