యంగ్ హీరోతో పెళ్లిపై సీనియర్ నటి రెస్పాన్స్!

Published : Apr 15, 2019, 02:37 PM IST
యంగ్ హీరోతో పెళ్లిపై సీనియర్ నటి రెస్పాన్స్!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తరువాత యువ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. 

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తరువాత యువ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరి గురించి బాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలను ప్రచురిస్తున్నారు. దానికి తగ్గట్లే ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, సన్నిహితంగా మెలగడం వంటివి చేస్తున్నారు.

వీరి ఎఫైర్ పై ఎన్ని వార్తలు వస్తున్నా.. ఈ జంట ఖండించకపోవడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మరింత ఊపందుకుంది. కొద్దిరోజులుగా ఈ జంట ఏప్రిల్ 18 నుండి 22 మధ్యలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మలైకాతన స్నేహితులతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అర్జున్ కూడా వెళ్లి ఆమెతో సమయం గడిపి వచ్చాడు. దీంతో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేసి వచ్చారని మీడియా ప్రచారం చేసింది. తాజాగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ వీడియో మలైకాని తన పెళ్లి విషయమై ప్రశ్నించింది.  

దీనికి ఆమె.. అలాంటిదేమీ లేదని తేల్చేసింది. అవన్నీ సిల్లీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది. పెళ్లి వార్తలు నిజం కాదని చెప్పింది కానీ వారి మధ్య బంధం గురించి మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. 


 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?