అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో ఊగిపోయిన మలైకా.. కిక్కు బాగా ఎక్కేసిందా, వైరల్ వీడియో

Published : Jun 26, 2023, 03:25 PM IST
అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో ఊగిపోయిన మలైకా.. కిక్కు బాగా ఎక్కేసిందా, వైరల్ వీడియో

సారాంశం

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. 

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.  అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

నేడు అర్జున్ కపూర్ తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అర్జున్ కపూర్ నివాసంలో గత రాత్రి గ్రాండ్ గా బర్త్ డే బాష్ నిర్వహించారు. బర్త్ డే పార్టీకి అర్జున్ కపూర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. తన ప్రియుడి బర్త్ డే పార్టీకి మలైకా హాజరు కాకుండా ఎలా ఉంటుంది.. హాజరవడం మాత్రమే కాదు పార్టీలో మలైకానే హైలైట్ గా నిలిచింది. బర్త్ డే పార్టీలో అంతా ఒక రేంజ్ లో హంగామా చేశారు. కానీ మలైకా మాత్రం ఒక ఊపు ఊపేసింది. 

టైట్ ఫిట్ బాడీ కాన్ డ్రెస్ లో మలైకా మెరిసింది. పార్టీలో ఆమెకి కిక్కు బాగా ఎక్కేసినట్లు ఉంది. దీనితో తన సూపర్ హిట్ సాంగ్ చయ్య చయ్యా కి అదిరిపోయే విధంగా డ్యాన్స్ చేస్తూ ఊగిపోయింది. తన ఒంపు సొంపులతో మెలికలు తిప్పుతూ అక్కడున్న వారికీ కనుల విందు అందించింది. దాదాపు 5 పదుల వయసులో ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొందరు పార్టీలో మలైకా కి బాగా కిక్కు ఎక్కేసినట్లు ఉంది.. అందుకే ఊగిపోతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?