మలైకా అరోరా వెంటపడ్డ అమ్మాయిలు.. హాట్‌ బ్యూటీ ఏం చేసిందంటే.. వీడియో వైరల్‌

Published : May 19, 2023, 05:09 PM ISTUpdated : May 19, 2023, 05:53 PM IST
మలైకా అరోరా వెంటపడ్డ అమ్మాయిలు.. హాట్‌ బ్యూటీ ఏం చేసిందంటే.. వీడియో వైరల్‌

సారాంశం

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరాకి విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌ వద్ద ఆమెని కొందరు పిల్లలు వెంటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌, మోడల్‌, యోగా బ్యూటీ మలైకా అరోరా సినిమాలు మానేసి ఇప్పుడు పూర్తిగా యోగా క్లాసులతో బిజీగా ఉంటుంది. ఆమె నిత్యం యోగా చేస్తూ రాణిస్తుంది. మరోవైపు ప్రతి పార్టీలోనూ గ్లామరస్‌గా కనిపిస్తూ వైరల్‌గా మారుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్‌ పూర్తిగా ప్రైవేట్‌గా సాగుతుంది. అందరిలా వాళ్లు బయటకు రాలేదు, ఫ్రీగా ఉండలేరు. బయటకు వస్తే అభిమానులు ఎగబడతారు, దీంతో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బయటకు రారు, చాలా వరకు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ మలైకా బయటకొచ్చింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడ ఆమెని గమనించిన కొందరు అమ్మాయిలు, పిల్లలు ఆమెని చుట్టుముట్టారు. ఏదో అడుగూ ఆమెని కదలనివ్వలేదు. చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె ఇబ్బంది పడుతూనే, తన సహాయకులతో ఎట్టకేలకు కారులోకి ఎక్కింది.

కానీ కారు డోర్‌ వేయనివ్వడం లేదు. ఏదో కావాలని అడుగుతున్నారు. కారుని కదలనివ్వడం లేదు. చాలా సేపు మలైకాని విసిగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఆ పిల్లలు బెగ్గర్సా? లేక చుట్టుపక్కల ఉండేవాళ్లా? అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పిల్లలు అలా చేయాల్సింది కాదు, వీళ్లు ఎప్పుడూ ఇంతే సెలబ్రిటీ కనిపిస్తే హడావుడి చేసి ఇబ్బంది పెడతారని అంటున్నారు. మరికొందరు పాపం ఆ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో, వారికి కావాల్సింది ఇవ్వచ్చు కదా అంటున్నారు. 

ఇక మలైకా అరోరా.. కెరీర్‌ ప్రారంభంలో నటిగా రాణించింది. ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గానూ నిలిచింది. చాలా వరకు టీవీ షోస్‌కి జడ్జ్ గా ఉంది. డాన్సు షోలకు మలైకా జడ్జ్ గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం `మూవింగ్‌ విత్‌ మలైకా`, `ఇండియా బెస్ట్ డాన్సర్‌` షోలు చేస్తుంది.ఇక `దబాంగ్‌` చిత్రాలకు ఆమె ప్రొడ్యూసర్‌గానూ ఉన్నారు. మలైకా 1998లో సల్మాన్‌ ఖాన్‌ బ్రదర్‌ అర్బాజ్‌ ఖాన్‌ని వివాహం చేసుకుంది. 2017లో ఈ ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. అయితే ఈ మధ్య ఈ ఇద్దరి మధ్య కూడా గ్యాప్‌ వచ్చినట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?
యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి...