ప్రియుడికి ఘాటు ముద్దుతో.. బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్న మలైకా.. ఫోటో, వీడియో వైరల్‌

Published : Oct 23, 2021, 04:12 PM IST
ప్రియుడికి ఘాటు ముద్దుతో.. బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్న మలైకా.. ఫోటో, వీడియో వైరల్‌

సారాంశం

తాజాగా మలైకా వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇందులో మలైకా శుక్రవారం రాత్రి ప్రియుడు అర్జున్‌ కపూర్‌ ఇంటి వద్ద కెమెరాలకు చిక్కడం విశేషం. వైట్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది మలైకా.

బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ మలైకా అరోరా(Malaika Arora Birthday).. బర్త్ డే జరుపుకుంటోంది. యోగా ట్రైనర్‌గా, మోడల్‌గా, నటిగా రాణిస్తున్న మలైకా నేడు(అక్టోబర్‌23) తన 48వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఇటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మరోవైపు బాలీవుడ్‌ శృంగార తార మలైకా అరోరా ఒకేరోజు పుట్టిన రోజు జరుపుకోవడం ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్ గా మారింది. 

ఇదిలా ఉంటే తాజాగా మలైకా వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇందులో మలైకా శుక్రవారం రాత్రి ప్రియుడు అర్జున్‌ కపూర్‌(Arjun Kpoor) ఇంటి వద్ద కెమెరాలకు చిక్కడం విశేషం. వైట్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది మలైకా. అర్జున్‌ కపూర్‌ ఇంటికి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంది. అయితే ఆమె వెళ్లిన తీరు, ఆమె ఎక్స్ ప్రెషన్స్ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి మలైకా ఇలా వెల్లడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

అయితే శుక్రవారం రాత్రి అర్జున్‌ కపూర్‌ ఇంట్లో తాను బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఓ పిక్‌ సైతం వైరల్‌ అవుతుంది. ఇందులో చేతిలో వైన్‌ గ్లాస్‌తో సోఫాలో కూర్చొని అర్జున్‌కి ఘాటు ముద్దు పెట్టింది మలైకా. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. శుక్రవారం రాత్రి ప్రియుడితో బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది మలైకా అరోరా. 

బాలీవుడ్‌లో హాట్‌ లవ్‌ కపూర్‌గా ఉన్నారు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా. తనకంటే చాలా చిన్నవాడైన అర్జున్‌తో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతుంది మలైకా. బహిరంగంగానే వీరిద్దరు కలిసి తిరుగుతుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. పూకార్లని లెక్కచేయకుండా వీరిద్దరు తమకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం మలైకా సినిమాలకు దూరంగా ఉంటుంది. దివా యోగా సెంటర్‌ని నడిపిస్తుంది. జిమ్‌ కంటే యోగా బాడీకి ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అర్జున్‌ కపూర్‌ ఇటీవల `భూట్ పోలీస్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం `ఏక్‌ విలన్‌ రిటర్స్న్‌`లో నటిస్తున్నారు అర్జున్‌. 

also read: ఆ లిస్టులో సారా అలీ ఖాన్.. ఇక సేఫ్ అంటూ దారుణంగా ట్రోలింగ్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు