పెళ్లి కాలేదు... కానీ ఇద్దరూ ఒకే ఇంటిలో క్వారంటైన్ గడిపారట!

Published : Dec 28, 2020, 09:09 PM IST
పెళ్లి కాలేదు... కానీ ఇద్దరూ ఒకే ఇంటిలో క్వారంటైన్ గడిపారట!

సారాంశం

 ఓ హీరోతో క్వారంటైన్ రోజులను గడిపానని మలైకా చెప్పింది. ఆ నటుడు అర్జున్ కపూర్ అని చెప్పకుండా.. పరోక్షంగా అతడితో తన క్వారంటైన్ అనుభవాలను పంచుకుంది మలైకా.''నిజం చెప్పాలంటే.. నేను నిజంగానే ఓ నటుడితో కలిసి క్వారంటైన్లో ఉన్నాను. అతను చక్కటి వినోదాన్నిచ్చే వ్యక్తి. అతడితో ఉంటే ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. నన్ను చూసి ఎంతసేపూ కామెడీ చేస్తుంటాడు. నన్ను నవ్విస్తూ ఉంటాడు. అతనంత సరదా వ్యక్తిని నేను చూడలేదు'' అని మలైకా చెప్పింది.   

బాలీవుడ్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట ఒక సంచలనం. తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతుంది మలైకా. వీరిద్దరి అఫైర్ బాలీవుడ్ బహిరంగ రహస్యమే. పబ్లిక్ వేదికలకు కూడా వీరిద్దరూ కలిసి హాజరవుతారు కాగా లాక్ డౌన్ సమయంలో తన క్వారంటైన్ అనుభవాలు పంచుకుంది మలైకా. మీరు క్వారంటైన్ లో గడపడానికి ఏ హీరోతో ఇష్టపడతారని రిపోర్టర్ అడుగా.. అర్జున్ కపూర్ అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చింది.  

తాను నిజంగానే ఓ హీరోతో క్వారంటైన్ రోజులను గడిపానని మలైకా చెప్పింది. ఆ నటుడు అర్జున్ కపూర్ అని చెప్పకుండా.. పరోక్షంగా అతడితో తన క్వారంటైన్ అనుభవాలను పంచుకుంది మలైకా.''నిజం చెప్పాలంటే.. నేను నిజంగానే ఓ నటుడితో కలిసి క్వారంటైన్లో ఉన్నాను. అతను చక్కటి వినోదాన్నిచ్చే వ్యక్తి. అతడితో ఉంటే ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. నన్ను చూసి ఎంతసేపూ కామెడీ చేస్తుంటాడు. నన్ను నవ్విస్తూ ఉంటాడు. అతనంత సరదా వ్యక్తిని నేను చూడలేదు'' అని మలైకా చెప్పింది. 

కొన్ని నెలల కిందట మలైకా కరోనా బారిన పడ్డట్లు మీడియాకు సమాచారం అందగా.. అర్జున్ కపూర్ సైతం వైరస్ బారిన పడే ఉంటాడని అంతా అనుకున్నారు. తర్వాత అదే నిజమని తేలింది. ఇద్దరూ తమ ఫ్లాట్లో క్వారంటైన్లో ఉండి కోలుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా