తనకు జరిగిన అవమానం చెప్పుకొని బాధపడిన దీపికా!

Published : Dec 28, 2020, 08:40 PM IST
తనకు జరిగిన అవమానం చెప్పుకొని బాధపడిన దీపికా!

సారాంశం

దీపికాకు అసలు నటన రాదని ఆమెను అవమానించారట. 19ఏళ్లకే పరిశ్రమకు వచ్చిన దీపికాకు ఈ నెగిటివ్ కామెంట్స్ చాలా ఇబ్బంది పెట్టాయని దీపికా అన్నారు. అయితే కెరీర్ లో గొప్ప గొప్ప పాత్రలు దీపికా పదుకొనె చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనె ఎదిగారు. 

ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ చిత్రం ఐశ్వర్యతో వెండితెరకు పరిచయం అయ్యింది దీపికా పదుకొనె. రెండో చిత్రమే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. 2007లో విడుదలైన ఓం శాంతి ఓం భారీ విజయాన్ని అందుకుంది. ఆ చిత్ర విజయంతో బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా దీపికా ఎదిగారు. అయితే కెరీర్ బిగినింగ్ లో దీపికా అనేక అవమానాలకు గురయ్యారట. ఓం శాంతి ఓం మూవీలో తన నటన అసలు బాగోలేదని కొందరు కామెంట్స్ చేశారట. 

దీపికాకు అసలు నటన రాదని ఆమెను అవమానించారట. 19ఏళ్లకే పరిశ్రమకు వచ్చిన దీపికాకు ఈ నెగిటివ్ కామెంట్స్ చాలా ఇబ్బంది పెట్టాయని దీపికా అన్నారు. అయితే కెరీర్ లో గొప్ప గొప్ప పాత్రలు దీపికా పదుకొనె చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దీపికా పదుకొనె ఎదిగారు. 

ప్రభాస్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది దీపికా. అశ్వినీ దత్ నిర్మాతగా... దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనే నటిస్తుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది . బాలీవుడ్ లో బిజీ అయ్యాక సౌత్ లో దీపికా సినిమాలు చేయలేదు. రజిని కాంత్ హీరోగా తెరకెక్కిన కొచ్చడయాన్ మూవీలో దీపికా నటించారు. ఆ చిత్రం తరువాత మరలా ప్రభాస్ మూవీతో దీపికా సౌత్ లో అడుగుపెట్టనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా