రవితేజ క్రాక్ నుండి క్రేజీ అప్డేట్!

Published : Dec 28, 2020, 08:14 PM IST
రవితేజ క్రాక్ నుండి క్రేజీ అప్డేట్!

సారాంశం

న్యూ ఇయర్ సంధర్భంగా క్రాక్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. 2021 జనవరి 1న క్రాక్ ట్రైలర్ విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్ న్యూ ఇయర్ రోజు ట్రైలర్ తో పండగ చేసుకోనున్నారు.  


మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈమూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ మూవీ ట్రైలర్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ సంధర్భంగా క్రాక్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. 2021 జనవరి 1న క్రాక్ ట్రైలర్ విడుదల కానుంది. రవితేజ ఫ్యాన్స్ న్యూ ఇయర్ రోజు ట్రైలర్ తో పండగ చేసుకోనున్నారు.

 ఇక విజయాల పరంగా వెనుకబడ్డ రవితేజ ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. గతంలో గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. 

సంక్రాంతి కానుకగా క్రాక్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ క్రాక్ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా... విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు రమేష్ వర్మతో ఓ మూవీ ప్రకటించిన రవితేజ, మారుతి దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా