హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేదా’ షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ.. ఆ తప్పుడు ఆరోపణల్ని కొట్టి పారేస్తూ ప్రకటన..

Published : Jul 04, 2022, 12:16 PM IST
హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేదా’ షూటింగ్ పై మేకర్స్ క్లారిటీ.. ఆ తప్పుడు ఆరోపణల్ని కొట్టి పారేస్తూ ప్రకటన..

సారాంశం

బాలీవుడ్ బడా స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న తాజాగా చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే మూవీపై వచ్చిన పలు ఆరోపణలను కొట్టిపారేస్తూ తాజాగా మేకర్స్ ప్రకటన చేశారు.  

తమిళంలో 2017లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’(Vikram Vedha) బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. తమిళ స్టార్స్ మాధవన్, విజయ్ సేతుపతి  కలిసి నటించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా, ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ పరంగా  అదరగొట్టింది. దీంతో ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్టు 2020లోనే రిలయన్స్ మరియు టీ సిరీస్ సంస్థలు ప్రకటించాయి.  ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరియు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాను ప్రకటించిన ఏడాదికి 2021 జూన్ లో చిత్రీకరణను ప్రారంభించారు. దాదాపు షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ కావచ్చింది.

తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’కు దర్శకత్వం వహించిన పుష్కర్ - గాయత్రీనే హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టేలు తమ షూటింగ్ షెడ్యూల్ ను ముగించారు. ప్రస్తుతం మరికొంత పార్ట్ చిత్రీకరణ హృతిక్ రోషన్ తో చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ ను లోకేషన్ యూఏఈకి బదులు భారత్ లోని యూపీలోకి మార్చడంతో హృతిక్ నిరాకరించడానికి ఇటీవల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఆయన సినిమా కోసం భారీనే డిమాండ్ చేశాండంటూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు. 

విక్రమ్ వేద షూట్ లొకేషన్‌లపై తప్పుడు ఆరోపణలు, పూర్తిగా నిరాధారమైన నివేదికలను మేం గమనించాం. విక్రమ్ వేదను  లక్నోతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాం. కొంత భాగాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ చిత్రీకరించారు. 2021 అక్టోబరు, నవంబర్‌లో బయో-బబుల్ కోసం మౌలిక సదుపాయాలను అందించే లోకేషన్ కావడంతో సిబ్బందికి అన్ని విధాలా సహకరించాం. వీటిని వక్రీకరించే ప్రయత్నాలను మానుకోవాలి. అలాగే రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సృజనాత్మక ప్రతిభను, వారి  సూచనలను మేం స్వాగతిస్తున్నాం. ఇక ఉత్పత్తి మరియు బడ్జెట్ నిర్ణయాలు అనేవి కేంద్రీకృత ప్రత్యేక హక్కుగా భావిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నాడు.  

పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలోనూ ‘విక్రమ్ వేద’గానే తెరకెక్కుతోంది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ తోపాటు హీరోయి్ రాధికా ఆప్టే (Radhika Apte) ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇప్పటికే చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ షెడ్యూల్ చేశారు. టీ సిరీస్, రిలయన్స్ తోపాటు వైనాట్ స్టూడియోస్, ప్లాన్ సీ స్టూడియోస్ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యంగా ఉన్నాయి. రూ.100 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు