
ఆర్ఆర్ఆర్ చిత్రంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రామరాజుగా చరణ్ లుక్, నటన నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం శంకర్ స్టైల్ లో సాగే సందేశం, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతోంది. ఇప్పటికే లీకైన పిక్స్ మూవీపై ఆసక్తి పెంచేశాయి. ఇదిలా ఉండగా రాంచరణ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి రాంచరణ్ భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు.. శంకరే. ఈ మూవీ 1000 కోట్ల బడ్జెట్ లో ఇండియాలోనే అతిపెద్ద చిత్రంగా ఉండేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అండర్ వాటర్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయాలనేది శంకర్ డ్రీమ్. ఈప్రాజెక్ట్ ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలి అంటే 1000 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందట.
ఈ చిత్రంలో హీరోలుగా రాంచరణ్, హృతిక్ రోషన్ అయితే బావుంటుందని శంకర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్ కి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక తన డ్రీమ్ ప్రాజెక్టు కి సంబందించిన వర్క్ స్టార్ట్ చేస్తారట. అయితే ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో బజ్ మాత్రమే. శంకర్ కాలు చెదిరే గ్రాఫిక్స్ తో ఫిక్షన్ మూవీస్ తీయడంలో సిద్ధహస్తుడు. అలాంటి డైరెక్టర్ రాంచరణ్, హృతిక్ లతో మల్టీస్టారర్ చేస్తే ఇండియా మొత్తం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనాలు ఖాయం.