
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడిగా మారుతికి పేరుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ప్రతిరోజూ పండగే చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కి సూపర్ హిట్ ఇచ్చాడు. ప్రతిరోజూ పండగే దాదాపు రూ. 35 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకుంది. ఓ స్టార్ హీరోతో మూవీ చేయాలనేది మారుతి టార్గెట్. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో పాటు పలువురు స్టార్స్ ని మెప్పించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ గ్యాప్ లో చకచకా రెండు చిత్రాలు పూర్తి చేశాడు. మంచిరోజులొచ్చాయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఇక లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్.గోపీచంద్(Gopichand) హీరోగా జులై 1న విడుదలైన పక్కా కమర్షియల్ వీకెండ్ ముగించుకుంది. పక్కా కమర్షియల్ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఒకటి రెండు కామెడీ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ మినహాయిస్తే సినిమాలో విషయం లేదని తేల్చేశారు. టాక్ కి తగ్గట్లే పక్కా కమర్షియల్ కలెక్షన్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. మూడు రోజులకు పక్కా కమర్షియల్ రూ. 6.20 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 5.24 షేర్ దక్కింది.
రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన పక్కా కమర్షియల్ (Pakka Commercial collections)టార్గెట్ రూ. 21 కోట్లుగా ఉంది. వీకెండ్ ముగిసే నాటికి నాలుగో వంతు వసూళ్లు మాత్రమే అందుకుంది. వీక్ డేస్ లో సాలిడ్ కలెక్టన్స్ రాబడితే తప్పా మూవీ బ్రేక్ ఈవెన్ చేరే ఆస్కారం కలదు. బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ చిత్రానికి పెద్దగా పోటీ లేదు. గత వారం విడుదలైన సమ్మతమే మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. నేడు పక్కా కమర్షియల్ చిత్రానికి వచ్చే కలెక్షన్స్ పై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది. ఇక పక్కా కమర్షియల్ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు.