Major Release Date: మేజర్ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Published : Apr 27, 2022, 05:33 PM ISTUpdated : Apr 27, 2022, 05:34 PM IST
Major Release Date: మేజర్ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సారాంశం

ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది అడివి శేష్ మేజర్ సినిమా. ఇక ఈసినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మూవీ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు.   

ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది అడివి శేష్ మేజర్ సినిమా. ఇక ఈసినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మూవీ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 

 

టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేసే యంగ్ హీరోలలో అడవి శేష్ ఒకరు. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ స్టోరీసే. ఇక ఇప్పుడు  అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా మేజ‌ర్.  26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో అమరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమాకు శ‌‌శి కిరణ్ తిక్కకా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

క‌రోనా ఎఫెక్ట్‌తో వరుసగా రిలీజ్ వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన ఈ  సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఫైన‌ల్ చేశారు మేక‌ర్స్. తాజా అప్ డేట్ ప్ర‌కారం 2022 జూన్ 3న ప్ర‌పంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా మేజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్ అయిన‌ స్టార్ హీరో మ‌హేశ్‌బాబు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 

తెలుగు, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో మేజర్ గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్  కానుంది. ఇక మేజ‌ర్  సినిమాలో బాలీవుడ్ భామ, ద‌బాంగ్ 3 ఫేం బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గానటిస్తోంది. ఈమూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.  సోనీ పిక్చ‌ర్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో