స్కూల్ పిల్లలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మేజర్ టీమ్, భావితరాలకు తెలియాలనే అడివి శేష్ ప్రయత్నం

Published : Jun 15, 2022, 02:10 PM ISTUpdated : Jun 15, 2022, 02:15 PM IST
స్కూల్ పిల్లలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మేజర్ టీమ్, భావితరాలకు తెలియాలనే అడివి శేష్ ప్రయత్నం

సారాంశం

స్కూల్ పిల్లల కోసం మేజర్ మూవీ టీమ్ తో పాటు హీరో అడవి శేష్.. బంపర్ ఆఫర్ ప్రకటించాడు. భావి తరాలకు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం గురించి తెలియాలనే ఉద్ధేశ్యంతో మేజర్ టీమ్ స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా మేజర్.  ఈ సినిమాపై దేశవ్యాప్తంగా  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీ నుంచే కాకుండా రాజకీయ వర్గాల నుంచి కూడా మేజర్ సినిమాకు అద్భతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఈమూవీ టీమ్ స్కూల్స్ కోసం స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. 

మేజర్ టీమ్  పాఠశాలకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యాలకు టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. స్కూల్ మేనేజ్ మెంట్  కోసం ప్రత్యేక షో వేస్తామని, అందుకోసం మేజర్ టీమ్ రిలీజ్ చేసిన ప్రత్యేక  మెయిల్ చేసి ఈ అవకాశాన్ని పొందొచ్చని మేజర్ టీమ్ అనౌన్స్ చేసింది. 

 

ఇక  ఇదే విషయానికి సంబంధించి మేజర్  సినిమా  హీరో  అడవి శేష్ ట్విట్టర్‌లో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలామంది చిన్నారులు తనకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారని అన్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. మేజర్  గురించి రేపటి తరానికి తెలియాలనేదే తమ లక్ష్యమని అడవి శేష్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?