
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. SS రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమా 2022 లోరిలీజ్ అయిన భారీ సినిమాలలో ఒకటి. RRR రిలీజ్ అయ్యి మూడు నెలలు అవుతున్నా. ఇంకా ఈ సినిమా మ్యానియా తగ్గలేదు. ఇండియాలో ఓ రేంజ్ లో దుమ్మురేపిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు చాలా మంది హాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తొంది. సోషల్ మీడియా వేదికగా పలువురు హాలీవుడ్ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి స్పందిస్తున్నారు.
RRR is over-the-top ridiculous insanity and it is AMAZING. It’s like Michael Bay and Baz Luhrmann and Stephen Chow teamed up to make a movie. It was 3 hours long but it could have been 4 hours and I would’ve still enjoyed it. pic.twitter.com/gjTbBFJdg8
నటుడు-రచయిత క్రిస్టోఫర్ మిల్లర్, డిస్నీ మరియు మార్వెల్ చిత్రకారుడు అలిస్ ఎక్స్ జాంగ్, చలనచిత్రం మరియు టీవీ రచయిత అమీ పాలెట్ హార్ట్‌మన్, ఇలా చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ గురించి స్పందించారు. అయితే ఇందులో కొందరు థియేటర్ లో ట్రిపుల్ ఆర్ సినిమా చూడగా.. కొంత మంది నెట్ ప్లిక్ లో RRRని వీక్షించారు.. అంతే కాదు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
So I thought there was no way this year, like absolutely no chance in hell, that there could possibly be a movie more batshit insane than Everything Everywhere All At Once… and then I watched this pic.twitter.com/XEBhy9bam8
SS రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR మార్చి 25 న మల్టీ లాగ్వేజ్ లో థియేటర్లలోకి వచ్చింది. అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా బాహుబలి రికార్డ్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఇక ఈసినిమా గురించి హాలీవుడ్ నటుడు, నిర్మాత మరియు రచయిత క్రిస్టోఫర్ మిల్లెర్ ట్విట్ చేశారు. RRR కామెడీ, పిచ్చితం కలిసిన సినిమా కాని ఇది ఒక అద్భతం అని అన్నారు. అంతే కాదు ఈ సినిమా ను పోల్చుతూ...ఇది మైఖేల్ బే మరియు బాజ్ లుహర్‌మాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి సినిమా తీయడం వంటిది అన్నారు. ఆర్ఆర్ఆర్ 3 గంటలు మాత్రంమే ఉంది.. కాని ఇది 4 గంటలు ఉండవచ్చు.. అంటూ.. తాను ఈ సినిమాను ఎంజాయ్ చేశానన్నారు.
మార్వెల్ మరియు డిస్నీ సినిమాల స్టార్ అలిస్ ఎక్స్ జాంగ్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమా గురించి స్పందించారు. కాబట్టి ఈ సంవత్సరం మంచి సినిమాలు చూడటానికి ఎటువంటి అవకాశం లేదని నేను అనుకున్నాను. నరకంలో ఖచ్చితంగా అవకాశం లేదు..ఒకవేళ ఉన్నా.. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు ఉండవచ్చని నేను భావించాను. కాని RRR అలా కాదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లోఅందుబాటులో ఉన్న ఇండియాన్ మూవీ.. ఇది సంవత్సరాలలో నేను చూసిన అత్యంత వైల్డ్ షిట్, దయచేసి నన్ను నమ్మండి అంతే కాదు వెంటనే ఈ సినిమా చూడండీ అంటూ.. ట్వీట్ చేశారాయన. ఇలా హాలీవుడ్ నుంచి ప్రముఖులు ట్రిపుల్ ఆర్ గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ RRR. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటించారు. అల్లూరిగా చరణ్, కొమురంభీమ్ గా ఎన్టీఆర్ అద్భుంగా పాత్రలు పోషించారు. డివివి దానయ్య దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ మరియు అలిసన్ డూడీ ఈసినిమాలో కీలక పాత్రలు పోషించారు.