'మజిలీ' మూవీ మూడు రోజుల కలెక్షన్స్!

Published : Apr 08, 2019, 12:00 PM IST
'మజిలీ' మూవీ మూడు రోజుల కలెక్షన్స్!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని సాధించింది. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద సినిమాకి బాగా డిమాండ్ పెరిగిపోతుంది. 

మొదటిరోజు రూ.7 కోట్లకు పైగా కలక్షన్లు సాధించిన ఈ సినిమా రెండు రోజులకు రూ.20 కోట్లు రాబట్టింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల కలెక్షన్స్ తో రూ.21 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో మూడు రోజులకు ఈ సినిమా రూ.5.91 కోట్ల షేర్ ని రాబట్టింది.

ప్రస్తుతం థియేటర్లలో 'మజిలీ' తప్ప మరే సినిమాలు లేకపోవడం కూడా దీనికి కలిసోస్తోంది. ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చూస్తుంటే మొదటివారంలోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్, గోపిసుందర్ సంగీతం అందించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది