మజిలీ సెన్సార్.. కాంబో పనిచేసేలా ఉంది!

Published : Apr 02, 2019, 03:03 PM ISTUpdated : Apr 02, 2019, 03:05 PM IST
మజిలీ సెన్సార్.. కాంబో పనిచేసేలా ఉంది!

సారాంశం

రియల్ లైఫ్ లో లవ్లీ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత చాలా రోజుల తరువాత వెండితెరపై జోడిగా కనిపించారు. మజిలీ సినిమా ఈ నెల 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా సెన్సార్ పనులను కూడా ముగించుకొని పాజిటివ్ టాక్ ను అందుకుంది/. 

రియల్ లైఫ్ లో లవ్లీ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత చాలా రోజుల తరువాత వెండితెరపై జోడిగా కనిపించారు. మజిలీ సినిమా ఈ నెల 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా సెన్సార్ పనులను కూడా ముగించుకొని పాజిటివ్ టాక్ ను అందుకుంది. 

మజిలీ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక గతంలో నాగ చైతన్య - సమంత మనం చిత్రం తరువాత చేసిన ఆటో నగర్ సూర్య డిజాస్టరయిన సంగతి తెలిసిందే. మళ్ళి అయిదేళ్ల తరువాత కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ సరైన కథలు దొరకలేదు. ఇక ఫైనల్ గా శివ నిర్వాణ మజిలీ కథ చెప్పగానే సమంత ముందుండి సినిమాను పట్టాలెక్కించింది. 

శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా టీజర్ ట్రైలర్ అలాగే సినిమా సాంగ్స్ కూడా పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. దీంతో సమంత - చైతు కాంబో హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తోంది. వారి పాత్రలు తెరపై సరికొత్తగా కనిపిస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమా అక్కినేని కపుల్స్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం