హిట్ డైరక్టర్ ని లాక్ చేసేసిన విజయ్ దేవరకొండ

Published : Apr 09, 2019, 06:05 PM IST
హిట్ డైరక్టర్ ని లాక్ చేసేసిన విజయ్ దేవరకొండ

సారాంశం

సినిమా హిట్ టాక్ తెచ్చుకోగానే వెంటనే ఆ డైరక్టర్ పై కర్చీఫ్ లు వేసేయటానికి పోటీలు పడతారు. అందుకు స్టార్ హీరోలు సైతం మినహాయింపు కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం అదే చేసారు. 

హీరోలెప్పుడూ హిట్ డైరక్టర్స్ కోసం వెతుకుతూంటారు. ప్రతీ శుక్రవారం రిలీజయ్యే సినిమాలపై వారి కన్ను ఉంటుంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోగానే వెంటనే ఆ డైరక్టర్ పై కర్చీఫ్ లు వేసేయటానికి పోటీలు పడతారు. అందుకు స్టార్ హీరోలు సైతం మినహాయింపు కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం అదే చేసారు. ఆయన శివ నిర్వాణని పిలిచి సినిమా ఇచ్చినట్లు సమాచారం.

నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. క్రికెటర్‌ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్‌ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. 

సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ దర్శకుడు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.  హార్ట్‌ టచింగ్ ఎమోషనల్‌ డ్రామాలతో అలరించిన శివా.. విజయ్‌ కోసం మంచి  కథను రెడీ చేయమని చెప్పేసాడట. తను కష్టపడకుండా తన గుమ్మంలోకి వచ్చిన ఈ ఆఫర్ తో శివ నిర్వాణ మురిసిపోతున్నారట.

ప్రస్తుతం  డియర్ కామ్రేడ్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నవిజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది.  

PREV
click me!

Recommended Stories

Arijit Singh Telugu Songs: స్టార్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ పాడిన తెలుగు హార్ట్ టచ్చింగ్‌ సాంగ్స్ ఇవే
BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌