బంగార్రాజుతో చంద్రముఖి రొమాన్స్

Published : Apr 09, 2019, 05:51 PM IST
బంగార్రాజుతో చంద్రముఖి రొమాన్స్

సారాంశం

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' .  ఆ సినిమాలో దసరా బుల్లోడు గెటప్ లో ...బంగార్రాజుగా నాగ్ ప్రేక్షకులను దుమ్ము రేపారు. దీంతో ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తోనే ఈ చిత్రానికి ప్రీక్వెల్  ప్లాన్ చేసారు. 

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' .  ఆ సినిమాలో దసరా బుల్లోడు గెటప్ లో ...బంగార్రాజుగా నాగ్ ప్రేక్షకులను దుమ్ము రేపారు. దీంతో ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తోనే ఈ చిత్రానికి ప్రీక్వెల్  ప్లాన్ చేసారు.  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాగ్ తన సొంత బ్యానర్‌లో ఎన్నికలు పూర్తి కాగానే లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాలో నాగార్జున సరసన  జ్యోతిక హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.  ఈ మేరకు ఆమెను ఎప్రోచ్ అయ్యారని , ఆమె కూడా సరేనందని వినికిడి. తమిళ స్టార్ హీరో సూర్య ని వివాహం చేసుకున్న జ్యోతిక ...చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యనే మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. చాలా తక్కువ సినిమాలు అదీ తన ప్రాధాన్యత ఉన్నవే చేస్తున్నారు. అయితే నాగార్జున తో సినిమా అనగానే ఆమె ఎక్కువ కండీషన్స్ పెట్టకుండానే ఓకే చేసిందని తెలుస్తోంది.

గతంలో జ్యోతిక ...తెలుగులో రవితేజ తో షాక్, నాగార్జున తో మాస్, చిరంజీవి తో ఠాగూర్ చిత్రాలు చేసారు.ఇక చంద్రముఖిగా జ్యోతిక నటన ఎప్పటికీ తెలుగు వారికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.

PREV
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్