మహేష్‌లో ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడట.. సితార, గౌతమ్‌లతో సెలబ్రేట్‌..

Published : Dec 31, 2020, 10:33 AM IST
మహేష్‌లో ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడట.. సితార, గౌతమ్‌లతో సెలబ్రేట్‌..

సారాంశం

బుధవారం నుంచే సెలబ్రిటీ, టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్ న్యూ ఇయర్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. చాలా వరకు గోవాకి చెక్కేస్తున్నారు. అక్కడ ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు తమకి నచ్చిన ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ మహేష్‌ మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా, డిసెంబర్‌ 31 సెలబ్రేషన్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ మూడ్‌ కనిపిస్తుంది. బుధవారం నుంచే సెలబ్రిటీ, టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్ న్యూ ఇయర్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. చాలా వరకు గోవాకి చెక్కేస్తున్నారు. అక్కడ ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు తమకి నచ్చిన ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ మహేష్‌ మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నారు. 

ఆయన తమ పిల్లలతోనే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తాను పిల్లాడిలా మారిపోయాడు. తమ పిల్లలు సితార, గౌతమ్‌లతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఫోటోని దర్శకుడు మెహర్‌ రమేష్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇందులో మహేష్‌, గౌతమ్‌, సితారలతోపాటు మెహర్‌ రమేష్‌ తనయ మోను ఉన్నారు. `మహేష్‌ సూపర్‌ స్టార్‌. కానీ ఆయనలోనూ ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు. ఈ దశాబ్దానికి ఫన్‌, ఫ్రెండ్‌షిప్‌తో వీడ్కోలు పలుకుతూ, 2021కి వెల్‌కమ్‌ చెబుతున్నారు` అని పేర్కొన్నారు. 

తమ పిల్లలతో చిన్న పిల్లాడిలా మారిపోయిన మహేష్‌ క్యూట్‌గా ఆకట్టుకుంటున్నారు. తమ ఇంటి మెట్లపై కూర్చొని దిగిన ఈ ఫోటో సైతం వైరల్ అవుతుంది. మహేష్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటించనున్నారు. త్వరలో ఇది షూటింగ్‌ ప్రారంభం కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

New Year Movies: కొత్త ఏడాది స్పెషల్‌గా థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. చిన్నోడు, పెద్దోడి మధ్య ఫైట్‌
Illu Illalu Pillalu Today Episode Dec 30: అమూల్య పెళ్లిని చెడగొట్టేందుకు వల్లితో కలిసి విశ్వక్