అరియానాతో పెళ్ళి.. నిజం లేదన్న అవినాష్‌.. మరో సినిమా ఛాన్స్

Published : Dec 31, 2020, 07:43 AM IST
అరియానాతో పెళ్ళి.. నిజం లేదన్న అవినాష్‌.. మరో సినిమా ఛాన్స్

సారాంశం

అవినాష్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే జీ తెలుగులో తాను జడ్జ్ గా పనిచేసే `బొమ్మ అదిరింది`లో అవినాష్‌కి ఓ ఆఫర్‌ ఇస్తానని నాగబాబు చెప్పారు. దాదాపు అది కన్ఫమ్‌ అని తెలుస్తుంది.  తాజాగా మరో ఆఫర్‌ వచ్చిందట. 

బిగ్‌బాస్‌ 4తో మరింత పాపులర్‌ అయ్యారు అవినాష్‌. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌజ్‌ని తనదైన కామెడీతో రక్తికట్టించాడు. నాల్గో సీజన్‌లో బాగా అలరించిన నటుడిగా నిలవడంతోపాటు నాగార్జున చేత ప్రశంసలందుకున్నారు. హౌజ్‌లో అవినాష్‌కి, అరియానాకి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో ఉందని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ముక్కు అవినాష్‌ స్పందించారు. అరియానాతో పెళ్లి అనే వార్తల్లో నిజం లేదని, తను మంచి ఫ్రెండ్‌ అని తెలిపారు. 

ఇదిలా ఉంటే అవినాష్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే జీ తెలుగులో తాను జడ్జ్ గా పనిచేసే `బొమ్మ అదిరింది`లో అవినాష్‌కి ఓ ఆఫర్‌ ఇస్తానని నాగబాబు చెప్పారు. దాదాపు అది కన్ఫమ్‌ అని తెలుస్తుంది. మరోవైపు ఎంటర్‌టైనింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా మరో ఛాన్స్ ఇస్తానని చెప్పారట. తన తదుపరి సినిమాల్లో నటించే ఛాన్స్ ఇస్తానని చెప్పినట్టు అవినాష్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

అనిల్‌ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్‌3` సినిమాని రూపొందిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ కూడా ఓ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇందులో అవినాష్‌కి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇక అవినాష్‌ సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టుకుని అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం