
మహేష్ బాబు పోలీస్ డ్రస్సు వేసుకున్న దూకుడు బ్లాక్ బస్టర్గా నిలిచింది. అదే ఊపులో వచ్చిన ఆగడు మాత్రం థియేటర్లలో ఆగలేదు. అయితే మురుగదాస్ దర్శకత్వంలో మరోసారి పోలీస్ డ్రస్ వేసుకుంటున్న మహేష్.. ఈసారి దూకుడు రేంజ్ సక్సెస్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. ఇందు కోసం టైటిల్ దగ్గర్నుంచి అన్ని అంశాలపై దగ్గరుండి మహేష్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్,మురుగదాస్ మూవీ కోసం పలు టైటిల్స్ అనుకున్నా.. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. శత్రువు, వాస్కోడిగామా, అభిమన్యు లాంటి టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బైలింగువల్ మూవీలో మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కడుతోంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.