
టాలీవుడ్ షేక్ అయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వణికిపోయే వార్త వైరల్ అవుతుంది. టోటల్‌గా ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లిపోయే మల్టీస్టారర్ ఒకటి సెట్ కాబోతుందట. టాలీవుడ్‌లో ఇద్దరు తిరుగులేని క్రేజీ స్టార్స్ కలిసి నటించబోతున్నారట. ఈ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి ఆ హీరోలెవరూ, ఆ కథేంటో చూస్తే..
ఇప్పుడు టాలీవుడ్ మల్టీస్టారర్ల ట్రెండ్ కొనసాగుతుంది. మహేష్‌బాబు, వెంకటేష్ కలిసి నటించిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`తో నయా మల్టీస్టారర్ ట్రెండ్ సెట్ అయ్యింది. ఆ తర్వాత పవన్, వెంకీ కలిసి `గోపాల గోపాల`, వెంకీ, రామ్ కలిసి `మసాలా`, నాగార్జున, కార్తీ కలిసి `ఊపిరి`, నాగార్జున, నాని కలిసి `దేవదాస్`, వెంకీ, వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్2` చిత్రాలు రూపొంది ఘన విజయాలు సాధించాయి. ఒక్క `మసాలా` చిత్రం మాత్రమే డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం బిగ్ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న `ఆచార్య` కూడా ఓ రకంగా మల్టీస్టారర్ అనే చెప్పాలి. అన్నీకుదిరితే త్వరలో మరో సంచలన మల్టీస్టారర్ రాబోతుందట. అది మరేంటో కాదు, మహేష్‌బాబు, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చల్‌చల్ చేస్తుంది.
మహేష్, తారక్ హీరోలుగా అల్లు అరవింద్ సినిమాలు చేయాలనుకున్నారు. అవి ఇంకా సెట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి ఒకే సినిమాగా, అది కూడా మల్టీస్టారర్‌గా తీస్తే ఎలా ఉంటుందనే దానిపై వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథని కూడా సిద్ధం చేయిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇదే సెట్ అయితే నిజంగానే ఇదొక సంచలన మల్టీస్టారర్ అవుతుందని, ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసే మల్టీస్టారర్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. కానీ ఈ వార్త మాత్రం ఇరు హీరోల అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది.
ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ సినిమా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు.