
`సాహో` స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు కావడంతో ఆయనకు పుట్టిన రోజు విశెష్‌లు వెల్లువలా వస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్‌కి బర్త్ డే విశెష్ తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు స్పందించారు. `అనంతమైన సక్సెస్ నీ సొంతం. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్.. ప్రభాస్‌తో ఉన్న ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటున్న ఈ ఫోటో ఆకట్టుకుంటుంది. ఇరు హీరోల అభిమానులను ఖుషీ చేస్తుంది.
మహేష్‌తోపాటు ఇండస్ట్రీకి చెందిన అనేక మంది డార్లింగ్‌కి బర్త్ డే విశెష్ చెబుతున్నారు. మెహర్ రమేష్, వరుణ్ తేజ్, కాజల్, మంచు మనోజ్, నాగబాబు, కార్తికేయ, ప్రశాంత్ వర్మ, కెకె రాధామోహన్ వంటి వారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.