కన్నీళ్లు పెట్టిస్తున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ అరుదైన వీడియో

Published : Oct 23, 2020, 11:05 AM IST
కన్నీళ్లు పెట్టిస్తున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ అరుదైన వీడియో

సారాంశం

ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ అరుదైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో `మేరా సాయా కి తేరా సాయా?` అంటూ విదేశాల్లో తన భార్య సుతపా సిక్దర్‌ తో కలిసి సరదాగా తిరుగుతూ పాడుకుంటున్నారు.

ఇర్ఫాన్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ విలక్షణ నటుడు. నో డౌట్‌ ఆయన ఒక లెజెండ్‌. హిందీతోపాటు ఇంగ్లీష్‌ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన యూనివర్సల్‌ యాక్టర్‌. ఆయన తన అభిమానులను, చిత్ర పరిశ్రమకి షాక్‌ ఇస్తూ క్యాన్సర్‌తో కన్నుమూశారు. దీంతో అంతా దుఖ సాగరంలో మునిగిపోయారు. 

తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ అరుదైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో `మేరా సాయా కి తేరా సాయా?` అంటూ విదేశాల్లో తన భార్య సుతపా సిక్దర్‌ తో కలిసి సరదాగా తిరుగుతూ పాడుకుంటున్నారు. ఆ పాటలోని అర్థం అభిమానులను కన్నీళ్ళు పెట్టిస్తుంది. అభిమానులు ఎమోషనల్‌గా ట్వీట్లు పెడుతున్నారు. 

ఈ వీడియోని ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు బాబిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇర్ఫాన్‌ క్యాన్సర్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్‌ ఖాన్‌ తెలుగులో `సైనికుడు` చిత్రంలో నటిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?