#SSMB28: విదేశాల నుంచి తిరిగొచ్చిన మహేష్‌.. త్రివిక్రమ్‌ తో సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ అప్‌డేట్‌

Published : Oct 31, 2022, 02:12 PM IST
#SSMB28: విదేశాల నుంచి తిరిగొచ్చిన మహేష్‌.. త్రివిక్రమ్‌ తో సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ అప్‌డేట్‌

సారాంశం

మహేష్‌బాబు ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల క్రితం వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా వెకేషన్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో త్రివిక్రంతో చేయబోతున్న సినిమా అప్‌డేట్ వచ్చింది. 

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే ఆలస్యమవగా, పలు అడ్డంకుల కారణంగా డిలే అవుతుంది. సినిమా ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. దసరా పండుగ అనంతరం సెకండ్‌ షెడ్యూల్‌ని ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇంతలోనే మహేష్‌ మదర్‌ ఇందిరాదేవి కన్నుమూశారు. దీంతో తల్లి మరణంతో మహేష్‌ మరింతగా కుంగిపోయాడు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ఇటీవల ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్‌ వెళ్లారు మహేష్. 

తాజాగా వెకేషన్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయన కెమెరాకి చెప్పారు. ఫ్యామిలీతో బ్యాక్‌ వస్తోన్న మహేష్‌ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతలోనే చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు చెబుతూ ట్వీట్‌ చేశారు. 

దీంతో మహేష్‌ అభిమానులకు ఊపొచ్చిందని చెప్పొచ్చు. `#SSMB28` యాష్‌ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్ ని కంటిన్యూ చేస్తూ రెండో షెడ్యూల్‌ని చేయనున్నట్టు సమాచారం. `అతడు`, `ఖలేజా` ల తర్వాత త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. గతంలో ఎప్పుడూ లేని ఓ కొత్త తరహా పాత్రలో మహేష్‌ కనిపించబోతున్నారని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దాన్ని మించి ఉంటుందని ఇటీవల ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. 

హారికా అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్‌.. రాజమౌళితో తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kavya Reddy BackGround: బెల్లంకొండ శ్రీనివాస్‌ భార్య కావ్య రెడ్డి బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసా? కొత్త జంట పెళ్లి ఫోటోలు
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?