
ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ మహేష్ గిఫ్ట్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న `సర్కారువారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇసుక రెడ్ కారు. అందులోనుంచి మహేష్ బయటకు దిగుతున్నట్టుగా ఉన్న మాస్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫైట్ సీన్‌కి సంబంధించిన లుక్ అని కారు అద్దాలు పగిలిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉంటుందనే సస్పెన్స్ కి తెర దించారు. పొడవాటి చుట్టుతో, కొత్త హెయిర్ స్టయిల్‌తో కనిపిస్తున్నాడు మహేష్. ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రీట్ కూడా సిద్ధం చేస్తున్నారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న `సూపర్‌స్టార్ బర్త్ డే బ్లాస్టర్` పేరుతో మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు.
అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్ చేశారు. సంక్రాంతికే బరిలోకి దిగబోతున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్‌లో ఏమాత్రం మార్పు లేదు. జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో వచ్చే సంక్రాంతికి బిగ్‌ఫైట్ తప్పేలా లేదు. ఇక ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మహేష్ స్పందిస్తూ తనకిది కొత్త జర్నీ అని, యాక్షన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా సినిమా సాగుతుందని, సంక్రాంతి రాబోతున్నామని తెలిపారు.