`తిమ్మరుసు` సక్సెస్‌ టాక్‌.. హీరో సత్యదేవ్‌ ఎమోషనల్‌

Published : Jul 31, 2021, 04:09 PM IST
`తిమ్మరుసు` సక్సెస్‌ టాక్‌.. హీరో సత్యదేవ్‌ ఎమోషనల్‌

సారాంశం

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర బృందం శనివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో సత్యదేవ్‌ ఎమోషనల్‌ అయ్యారు. 

హీరో సత్యదేవ్‌ ఎమోషనల్‌ అయ్యారు. తన సినిమాని థియేటర్లో చూసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సత్యదేవ్‌ హీరోగా నటించిన `తిమ్మరుసు` చిత్రం శుక్రవారం థియేటర్లో విడుదలైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదలైన తొలి చిత్రంగా చెప్పొచ్చు. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర బృందం శనివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో సత్యదేవ్‌ ఎమోషనల్‌ అయ్యారు. 

తను హీరోగా నటించిన సినిమాకి తొలి సారి సక్సెస్‌ మీట్‌ చేసుకుంటున్నామని, చాలా ఉద్వేగంగా ఉందన్నారు. `బ్లఫ్‌మాస్టర్‌` సినిమా తర్వాత నా సినిమా థియేటర్లో మంచి రిలీజ్‌ అయ్యిందని, తనకిది ఒక డ్రీమ్‌లా ఉందన్నారు. థియేటర్లో ఆడియెన్స్ తో సినిమా చూస్తుంటే వారి ఈలలు, గోలలు వింటుంటే ఆనందంగా ఉంది. తాము అనుకున్న సన్నివేశాలు థియేటర్లో పేలుతుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. హీరోగా నటించిన సినిమా హిట్‌ ఇలా సక్సెస్‌ మీట్‌ జరుపుకోవడం ఫస్ట్ టైమ్‌ అని, ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. దర్శకుడు, నిర్మాత మహేష్‌ కోనేరు ఇలా టీమ్‌ అందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత మహేష్‌ కోనేరు టీమ్‌కి, ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. తమ బ్యానర్‌పై వచ్చిన సినిమాలన్నీ సక్సెస్‌ సాధించడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ, కరోనా సమయంలో మా సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం మాకు ఇది `బాహుబలి`లాంటి సక్సెస్‌ అని తెలిపారు. కొత్త వారిని ఎంకరేజ్‌ చేయాలని, మంచి మాటలు చెప్పి సినిమాని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి, పటాసులు కాల్చి  సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్