
తెలుగు నుంచి వరసపెట్టి హిందీలో జెర్సీ, ఎఫ్-2, హిట్, క్రాక్, నాంది తదితర చిత్రాలు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన మరో సినిమాను హిందీలో రీమేక్ కాబోతోంది. అదే.. రెడ్. ఈ చిత్రం తమిళ హిట్ తడమ్‌కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి హిట్టయింది. తెలుగులో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో సిద్దార్థ్ రాయ్ కపూర్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించన వచ్చేసింది. మృణాల్ కపూర్ హీరోయిన్ అని తెలుస్తోంది. వర్ధన్ ఖేత్కర్ అనే కొత్త దర్శకుడితో ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు, సెంకండాఫ్ ఉత్కంఠగా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ లో లో సన్నివేశాలన్నీ కూడా రెండు పాత్రల నేపథ్యం ... వారి ప్రేమకథల్ని ఆవిష్కరిస్తూ సాగుతాయి. కథేమీ లేకపోవడంతో, అక్కడక్కడా సాగదీతలా అనిపిస్తుంది.
ఇక ఈ చిత్రంలో హిరో ద్విపాత్రాభినయం... అలాగే ఇది ఓ థ్రిల్లర్ కథ. - ఇలా పలు ప్రత్యేకతలున్న సినిమా ఇది. తమిళంలో విజయవంతమైన ‘తడమ్’కి రీమేక్. తెలుగులో మాతృకతో పోలిస్తే అదనంగా కుటుంబ నేపథ్యాన్ని, ప్రేమకి సంబంధించిన అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు తిరుమల కిశోర్. రామ్ ఇదివరకు చేసిన చిత్రాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన అనుభూతినే పంచుతుందని బావించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆ వైవిధ్యాన్ని కొనసాగించినట్టు చెప్పుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో హిందీకు ఏ మార్పులు చేస్తారనే విషయమై అంతటా హాట్ టాపిక్ గా మారింది.
చిత్రం కథేమిటంటే.. ఆదిత్య (రామ్) ఇంటర్ చదివి జులాయిగా తిరిగే ఓ కుర్రాడు. పేకాట అంటే పిచ్చి. తన స్నేహితుడు వేమ (సత్య)తో కలిసి మోసాలకి పాల్పడుతుంటాడు. వేమ తన అప్పుల్ని తీర్చడం కోసమని దాచుకున్న రూ.8 లక్షల మొత్తాన్ని పేకాటలో పోగొడతాడు ఆదిత్య. ఆ తర్వాత ఆ డబ్బు ఎలా సర్దాలో తెలియక సతమతమవుతాడు. ఇంతలో ఆకాశ్ అనే ఓ కుర్రాడు హత్యకు గురవుతాడు. అతని దగ్గర లాకర్‌లో ఉన్న రూ. 11 లక్షల డబ్బు కూడా కనిపించదు. మరి ఆ హత్య చేసింది ఆదిత్యేనా? కాదా? అచ్చం ఆదిత్య పోలికలతో ఉన్న సివిల్ ఇంజినీర్ సిద్ధార్థ్ (రామ్) కూడా ఈ కేసులో నిందితుడే. మరింతకీ ఈ హత్య చేసిందెవరు? పరిశోధనలో ఎలాంటి నిజాలు తెలిశాయి. ఆదిత్యపై మనసు పడిన గాయత్రి (అమృత అయ్యర్), సిద్ధార్థ్‌ని ప్రేమించిన (మహిమ)ల కథేమిటనే కోణంలో జరుగుతుంది.