
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. `గీత గోవిందం` తో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించినట్టు తెలుస్తుంది. తాజాగా సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభమైందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై రామ్ ఆచంట, గోపీఆచంట, రవిశంకర్, నవీన్ ఎర్నేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ చివరగా గతేడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వంశీపైడిపల్లితో సినిమా చేస్తామని ప్రకటించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత పరశురామ్‌తో సినిమాని ప్రకటించి షాక్ ఇచ్చాడు మహేష్. ఈ సినిమా గతేడాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా నేడు రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు. బ్యాక్ టూ బ్యాక్ గ్యాప్ లేకుండా షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల కీర్తిసురేష్ దుబాయ్ వెళ్లారు. ఇప్పటికే మహేష్ దుబాయ్‌లో ఉన్నారు. నమ్రత పుట్టిన రోజుని ఫ్యామిలీతో అక్కడే సెలబ్రేట్ చేశారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తారని, బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.