రామ్‌చరణ్ కి లవ్ ఇంట్రెస్ట్ సెట్ అయ్యింది. ఆయనతో ఆడిపాడేందుకు, రొమాన్స్ చేసేందుకు అమ్మాయి దొరికింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. గతేడాది `అలా వైకుంఠపురములో` చిత్రంతో బంపర్ హిట్‌ని అందుకున్న పూజా ఫస్ట్ టైమ్ రామ్‌చరణ్‌తో ప్రేమ పాఠాలు నేర్చుకోబోతుంది.

రామ్‌చరణ్ ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో చరన్ `సిద్ధ` అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డేని ఫైనల్ చేశారట. తాజాగా ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మొదట ఇందులో రష్మిక మందన్నా పేరు వినిపించింది. ఆమె బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పూజాని ఫైనల్ చేశారని టాక్.
ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`లో ఆడిపాడుతుంది. `ఆచార్య` వంటి మరో బిగ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో పూజా పాత్ర నిడివి ఎక్కువ ఉండదని టాక్.మరోవైపు పూజా హిందీలో `సర్కస్` అనే సినిమా చేస్తుంది.