Mahesh Tweet on Bheemla Nayak: పవన్‌ ఫైరింగ్‌, రానా సంచలనం.. `భీమ్లా నాయక్‌`పై మహేష్‌ ప్రశంసల వర్షం..

Published : Feb 26, 2022, 10:30 PM IST
Mahesh Tweet on Bheemla Nayak: పవన్‌ ఫైరింగ్‌, రానా సంచలనం.. `భీమ్లా నాయక్‌`పై మహేష్‌ ప్రశంసల వర్షం..

సారాంశం

పవన్‌, రానాలు కలిసి నటించిన `భీమ్లా నాయక్‌` చిత్రంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రశంసలు కురిపించారు. సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేయగా, అది వైరల్‌ అవుతుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) నటించిన `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు(Maheshbabu) ప్రశంసలు కురిపించారు. పవన్‌ నటన ఫైరింగ్‌ అంటూ, రానా సంచలనం అంటూ అప్రిషియేట్‌ చేశారు. కాస్ట్ అండ్‌ క్రూని ఆకాశానికి ఎత్తేశారు. `భీమ్లా నాయక్‌` ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. Pawan Kalyan ఫైరింగ్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆయన నటన అద్భుతం. అలాగే డేనియల్‌ శేఖర్‌గా రానా సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్ అద్భుతం. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రైటింగ్‌ ఎప్పటిలాగే పదునైనది. తెలివైనది. ఇటీవల కాలంలో ఉత్తమమైనది. రవి కె చంద్రన్‌ విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఆయన నా ఫేవరేట్‌ లెన్స్ మెన్‌. థమన్‌ సంగీతం స్పెల్‌ బౌండ్‌. హంట్‌ చేసేలా పాటలున్నాయి. సంచలనం సృష్టిస్తున్నాయి. దర్శకుడు సాగర్‌ కె చంద్ర, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్లకి నా అభిమానలు` అని మహేష్‌ ట్వీట్లు చేశారు. ఇప్పుడవి నెట్టింట వైరల్‌ అవుతుంది. పవన్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. 

జనరల్‌గా మహేష్‌, పవన్‌ ల మధ్య మంచి అనుబంధం ఉంది. బయట వీరిద్దరు కలిసి కనిపించింది చాలా అరుదు. కానీ సినిమాల పరంగా ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు. పవన్‌ `జల్సా` సినిమాకి మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఒకరి సినిమాలకు ఒకరు పరోక్షంగా సపోర్ట్ చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. 

ఇక పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్‌` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ అందుతోంది. తొలి రోజు ఈ చిత్రం 33కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం. మరోవైపు థియేటర్లలోనూ ఇది విజయవంతంగా రన్‌ అవుతుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యా మీనన్‌,సంయుక్త మీనన్‌ కథానాయికలుగా నటించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా