
`బిగ్‌బాస్`(BiiBoss Show Telugu) రియాలిటీ షో మరోసారి వివాదంలో నిలిచింది. ఈ షోపై సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ హౌజ్‌ని బ్రోతల్ హౌజ్‌గా పోల్చారు. శనివారం(ఫిబ్రవరి 26) నుంచి ప్రారంభం కానుంది. ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ షోపై పలువురు సామాజిక కార్యకర్తలు, పార్టీల నాయకులు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటి వరకు తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్‌బాస్ తెలుగు. ఆరో సీజన్‌ని ఓటీటీలో(BiggBoss Telugu 6 OTT) ప్రసారం చేయబోతున్నారు. దాదాపు 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రసారం కానుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది 24గంటలు ప్రసారం కాబోతుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ షోని చూసే అవకాశం ఉంది. గత సీజన్లలో ఈ షోకి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీ షోపై ఆసక్తి నెలకొంది. దీన్ని యాంకర్, దర్శకుడు ఓంకార్ సంస్థ అయిన ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వహిస్తుంది.
అయితే ప్రారంభం రోజే వివాదంగా మారడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ బిగ్‌బాస్ షోపై వివాదాస్పద కామెంట్లు చేసిన సీపీఐ నేత నారాయణ మరోసారి విరుచుకుపడ్డారు. షోని బ్రోతల్ హౌజ్‌గా పోల్చడం మరింత దుమారం రేపుతుంది. `బిగ్‌బాస్` అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్ షో, కల్చరల్ ఈవెంట్, గేమ్ షో కాదని, లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌజ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదొక పెద్ద నాన్సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు.
అసలు సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటని.. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు `స్టాప్ బిగ్‌బాస్` అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రత్యేక ప్రచారం కూడా మొదలు పెట్టారు. మరోవైపు సామాజిక కార్యకర్తలు కూడా ఈషోపై నెగటివ్ కామెంట్లు చేయడం మరింత హాట్ టాపిక్ అవుతుంది.
దీనికి తోడు గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్ పునర్నవి సైతం దీనిపై నెగటివ్ ప్రచారం మొదలు పెట్టింది. బిగ్‌బాస్ షో ద్వారా ఏం నేర్చుకున్నావ్ పునర్నవి అంటే ఆమె మళ్లీ బిగ్‌బాస్ షోకి వెళ్లకూడదని నేర్చుకున్నా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలపడం మరింత హాట్ టాపిక్ అవుతుంది. అయినప్పటికీ ఈ షోకి ఆదరణ పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం ఓటీటీ బిగ్‌బాస్ తెలుగు 6 షోలో అరియానా, అఖిల్, సరయు, ఆషురెడ్డి, ధన్‌రాజ్ వంటి వారితోపాటు కొత్తగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ10 విన్నర్ రాజు, టిక్‌టాక్ దుర్గారావు, వెబ్ సిరీస్ నటి వైష్ణవి, వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష వంటి వారు పాల్గొంటున్నారని తెలుస్తుంది.